ప్లాస్టిక్ అందాల న‌డుమ ఒరిజిన‌ల్ బ్యూటీ

తాజాగా సారా కిల్ల‌ర్ లుక్ కి సంబంధించిన ఫోటోషూట్ ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. దురంధ‌ర్ బ్యూటీ సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.;

Update: 2025-12-14 06:15 GMT

`నాన్న` సినిమాతో బాల‌న‌టిగా గొప్ప పేరు తెచ్చుకుంది సారా అర్జున్. త‌మిళంలో ఈ చిత్రం దైవ‌ర్ తిరుమ‌గ‌ళ్ పేరుతో విడుద‌లైంది. విక్ర‌మ్ కుమార్తెగా క్యూట్ సారా న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే సారా ఇప్పుడు అడ‌ల్ట్ ఏజ్ లో ప్ర‌వేశించింది. క‌థానాయిక‌గా కెరీర్ ని ప్రారంభించి త‌న‌దైన హ‌వా సాగిస్తోంది. ర‌ణ్ వీర్ సింగ్ లాంటి సీనియ‌ర్ స‌ర‌స‌న దురంధ‌ర్ లో సారా న‌ట‌న‌కు గొప్ప గుర్తింపు ద‌క్కింది. ఆ ఇద్ద‌రికీ వ‌య‌సు రీత్యా చాలా వ్య‌త్యాసం ఉన్నా, సారా త‌న అద్భుత న‌ట‌నా నైపుణ్యంతో షో స్టాప‌ర్ గా నిలిచింది.



 


దురంధ‌ర్ 300కోట్ల క్ల‌బ్ లో అడుగు పెడుతోంది. ఈ చిత్రం 500కోట్ల క్ల‌బ్ ని సాధించి ఈ ఏడాదికి ఘ‌న‌మైన ముగింపును ఇస్తుంద‌ని ఆశిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌న అదృష్టానికి మురిసిపోయిన సారా అర్జున్, ఆమె తండ్రి రాజ్ అర్జున్ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే దురంధ‌ర్ సినిమాకి సారాను ఎంపిక చేసిన కాస్టింగ్ ఏజెంట్ ముఖేష్ చాబ్రా రుణం తీర్చుకోలేనిది అంటూ సారా, ఆమె తండ్రి రాజ్ అర్జున్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ హీరోయిన్ గా సారా పేరు మార్మోగుతోంది. ఈ సినిమా త‌ర్వాత త‌న భ‌విష్య‌త్ కి ఎలాంటి డోఖా ఉండ‌ద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.



 


దీనికి త‌గ్గ‌ట్టే సారా ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో గేమ్ ఛేంజ్ చేసింది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఈ యంగ్ బ్యూటీ విరుచుకుప‌డుతోంది. తాజాగా సారా కిల్ల‌ర్ లుక్ కి సంబంధించిన ఫోటోషూట్ ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. దురంధ‌ర్ బ్యూటీ సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.



 


సారా అర్జున్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఫ్యూచ‌రిస్టిక్ గౌనులో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఆ దుస్తులలో సాహసోపేతమైన ఆవిష్కరణలు, విభిన్న‌మైన‌ శైలులు ఆక‌ట్టుకుంటున్నాయి అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఈ లుక్ ప‌రిశీలిస్తే, మోడ్ర‌న్ స్టైల్ కి, కళాత్మక వైబ్ ని తీసుకురావ‌డంలో సారా ఆత్మవిశ్వాసం ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. బాలీవుడ్ లో నేపో కిడ్స్ మ‌ధ్య అందాల‌ సారా ప్ర‌తిభ‌తో దూసుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. చాలా ప్లాస్టిక్ ముఖాల మ‌ధ్య సారా నిజ‌మైన అందంతో క‌ట్టి ప‌డేయ‌బోతోంది అంటూ ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు.

Tags:    

Similar News