జాతీయ అవార్డు డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి!
ప్రస్తుతం తాను ఉన్న బిజీలో ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు. గ్లోబల్ స్థాయిలో పేరు రావడంతో రెండేళ్లకు ఒక సినిమా చొప్పున చేస్తున్నాడు.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎంతో మంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. దాదాపు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు ంఅంతా చరణ్ తో ఒక్క సినిమా అయినా తీయాలని వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ..వంశీ పైడిపల్లి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి ఇలా పేరున్న చాలా మంది క్యూలో ఉన్నారు. చరణ్ డేట్లు ఇస్తే ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించడానికి సిద్దంగా ఉన్న డైరెక్టర్లే వీళ్లంతా. వీళ్లు గాక టైర్ 2 హీరోలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న డైరెక్టర్లు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీళ్లందరితో చరణ్ సినిమా తీయడానికి చాలా సమయం పడుతుంది.
`ధృవ` సమయంలోనే అడిగారు:
ప్రస్తుతం తాను ఉన్న బిజీలో ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు. గ్లోబల్ స్థాయిలో పేరు రావడంతో రెండేళ్లకు ఒక సినిమా చొప్పున చేస్తున్నాడు. అంతటి బిజీ స్టార్ యువ డైరెక్టర్ సందీప్ రాజ్ ని కలిసిన సందర్భంలో మంచి స్టోరీ ఉంటే చెప్పమని అడిగారుట. ఈ విషయాన్ని సందీప్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం సదీప్ రాజ్ తెరకెక్కించిన `మోగ్లీ` ప్రచారం పనుల్లో భాగంగా `ధృవ` టైమ్ లో చరణ్ ని కలిసిన సందర్బాన్ని గుర్తు చేసుకున్నాడు. `ధృవ` టైమ్ లోనే మంచి కథ ఉంటే చెప్పు అని అడిగారుట చరణ్.
ఆచితూచి చేసిన మోగ్లీ:
అంత పెద్ద స్టార్ తనని స్టోరీ అడగడంతో ఎంతో సంతోషానికి, ఆశ్చర్యానికి గురయ్యానన్నాడు. `కలర్ ఫోటో`తో సందీప్ రాజ్ దర్శకుడిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంగా నిలిచింది. ఆ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీంతో సందీప్ రాజ్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ తాను మాత్రం తొందరడపడకుండా ఆచితూచి వ్యవ హరిస్తున్నాడు. జాతీయ స్థాయిలో వచ్చిన పేరును చెడగొట్టకుండా తాజా చిత్రం `మోగ్లీ` తీసినట్లు తెలిపాడు.
ఆస్టార్ తో సందీప్ రాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్:
ఇందులో హీరోగా యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటిస్తున్నాడు. `బబుల్ గమ్` సినిమాతో రోషన్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా నిరుత్సాహ పరిచింది. దీంతో సందీప్ రాజ్ చెప్పిన మోగ్లీ కథ నచ్చడంతో ఆ ద్వయం పట్టాలెక్కింది. అలాగే సందీప్ రాజ్ నటుడిగా కూడా రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా కంటే ముందే ఓ స్టార్ హీరోకి స్టోరీ చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. వాటిపై కూడా స్పం దించాడు. ఆ స్టార్ తో కచ్చితంగా సినిమా ఉంటుందని..అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపాడు.