మాస్టర్ చెఫ్ షో కోసం సమంత ప్రత్యేక లుక్.. మెస్మరైజ్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2026-10-14 13:17 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైనా మహిళలు గర్భం దాలిస్తే భగవాన్ నామస్మరణతో 9 నెలలు బిడ్డ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సమంత ఒకవైపు బిడ్డ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరోవైపు వైద్యుల సమక్షంలో కొత్త బాధ్యతలు చేపట్టింది. ఇన్ని రోజులు హీరోయిన్ గా , నిర్మాతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సామ్ జామ్ తర్వాత హోస్ట్గా చేస్తున్న మరో ప్రాజెక్టు సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్.




ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నప్పుడే సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి శుభం అనే సినిమా చేసి నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత రాజ్ తో ఏడడుగులు వేసింది సమంత. ఆ తర్వాత మళ్లీ తన బ్యానర్లో మా ఇంటి బంగారం సినిమా చేసి 100 కోట్ల క్లబ్లో చేరి భారీ సక్సెస్ అందుకున్న ఈమె.. గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇకపోతే ప్రస్తుతం నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన సమంత.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం సోనీ లివ్ / సోనీ వింజా తమిళ్ తో కొత్త ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈమె చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏంటి? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.




ఈమె ఒక కుకింగ్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నట్లు సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ పేరిట ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ అక్టోబర్ 19 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కూడా నిర్వాహకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కోసం సమంత అందంగా ముస్తాబైన ట్రెండీ ఔట్ఫిట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఏకంగా మూడు రకాల భిన్నమైన దుస్తులతో కూడిన అవుట్ ఫిట్ ఫోటోలను ఆమె షేర్ చేసింది.




సమంత షేర్ చేసిన మొదటి నాలుగు ఫోటోలలో ఈమె లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంప్రదాయ రూపాలకు భిన్నంగా సరికొత్త పద్ధతిలో సిల్క్ చందేరి వీవ్ తో రూపొందించిన ప్లేయర్డ్ కలిదార్ షార్ట్ టిష్యూను ధరించింది. హ్యాండ్ కట్ బ్రోకేడ్ అప్లిక్ వర్క్ , సిల్వర్ ఎంబ్రాయిడరీ తో చాలా సున్నితంగా చేతితో డిజైన్ చేశారు. బాటం విషయానికి వస్తే.. దీనికి కాంబినేషన్ గా నలుపు , గ్రే కలర్ జిగ్ జాగ్ బాక్సుల తరహాలో డిజైన్ చేసిన టిష్యూ బ్యారెల్ ఫ్యాంటును ఈమె ధరించింది..మొత్తానికైతే ఈ అవుట్ ఫిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.




మరో ఫోటోలో మృణాళిని రావు డిజైన్ చేసిన ప్రథ వన్ షోల్డర్ కేప్ సెట్ ధరించింది. ఎత్నిక్ ఫ్యూజన్ దుస్తుల సెట్తో తనదైన శైలిలో ఆకట్టుకుంది. మరో అవుట్ ఫిట్ లో ప్లెయిన్ గ్రీన్ కలర్ చీరకు రెడ్ కలర్ బోర్డర్ అంచుతో డిజైన్ చేసిన చీర కట్టుకొని తన బేబీ బంప్ ను సున్నితంగా కవర్ చేసింది. ఇక బోర్డర్ కి సరిపోయే రెడ్ కలర్ బ్లౌజ్ ధరించింది. సింపుల్ చౌకర్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకొంది.






Tags:    

Similar News