సమంత ఛాన్స్ కరీనా తన్నుకుపోతుందా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - క్రేజీ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - క్రేజీ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో `ఫ్యామిలీ మ్యాన్ 2`, `సిటాడెల్` వంటి సిరీస్‌లు చేసిన సమంతకే ఈ ఛాన్స్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సమంతకు షాక్ ఇస్తూ ఆ పాత్రలోకి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
సమంత - రాజ్ నిడిమోరు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో? సల్మాన్ సరసన నటించే అద్భుతమైన అవకాశం ఆమెకే వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. ఇప్పటికే హిందీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమంతకు సల్మాన్ సినిమా పడితే ఆమె రేంజ్ మారిపోతుందని విశ్లేషకులు భావించారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ పాత్రకు సీనియర్ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి కరీనా కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. కరీనా కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జోడీకి బాక్సాఫీస్ వద్ద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన `బజరంగీ భాయ్‌జాన్`, `బాడీగార్డ్` వంటి చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. రాజ్ అండ్ డీకే మార్క్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇద్దరు సీనియర్ స్టార్స్ కలిసి నటిస్తే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుందని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో దాదాపు ఖాయమనుకున్న సమంత అవకాశం చేజారి కరీనా చేతికి వెళ్తుండటం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
హీరోయిన్ రేసు నుండి సమంత తప్పుకుంటుందనే వార్త అభిమానుల్ని నిరుత్సాహ పరుస్తుంది. మరి ఇదే సినిమాలో సామ్ ని గెస్ట్ రోల్‌లోనైనా చూపిస్తారా ? అని ఆశగా ఎదురు చూడటం అప్పుడే మొదలైంది. రాజ్ అండ్ డీకే సినిమాల్లో పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి .కాబట్టి సమంత కోసం ఏదైనా ప్రత్యేకమైన క్యామియో పాత్రను డిజైన్ చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సమంత అతిథి పాత్రలో కనిపిస్తే? అది సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతుందనడంలో సందేహం లేదు.
సాధారణంగా సినిమా పరిశ్రమలో కాంబినేషన్లు ఈక్వేషన్లు చివరి నిమిషంలో మారిపోతుంటాయి. మార్కెట్ విలువలు -పాత్రకు సరిపోయే ఆహార్యాన్ని బట్టి దర్శకులు నిర్ణయాలు తీసుకుంటారు. సమంత ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం లేదా సల్మాన్ సరసన కరీనా అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావించడం వల్ల ఈ మార్పు జరిగి ఉండొచ్చు. ఏదేమైనా? సమంత వంటి టాలెంటెడ్ నటిని ఒక క్రేజీ ప్రాజెక్టులో మిస్ అవ్వడం ఆమె ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించే విషయమే. సల్మాన్ ఖాన్-రాజ్ అండ్ డీకే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరీనా కపూర్ ఎంట్రీతో ఈ ప్రాజె మక్టుకు మరింత గ్లామర్ తోడైంది. మరి సమంతను కనీసం ఒక చిన్న పాత్రలోనైనా చూపిస్తారా లేక పూర్తిగా పక్కన పెట్టేస్తారా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.