• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. మరో సునామీ...

సలార్.. మరో సునామీ రానుంది

| యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న సినిమా సలార్

By - Tupaki Desk
Update: 2023-12-03 08:47 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ సలార్ ని రెండు భాగాలుగా నిర్మించింది. సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతోందని ట్రైలర్ తో స్పష్టం అవుతోంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో సలార్ కథ ఏంటి అనేది ప్రశాంత్ నీల్ చెప్పేశారు. పార్ట్ 1 కంప్లీట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని నాయకుడిగా నిలబెట్టడానికి దేవా పాత్రలో ప్రభాస్ చేసే సాహసాలతోనే ఉండబోతోందని తెలుస్తోంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదని కామెంట్స్ వినిపించాయి.

అయితే ట్రైలర్ లో నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ ని చూపించారు. ఇదిలా ఉంటే సలార్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ని కూడా ప్రేక్షకులకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్ ని పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్, యాక్షన్ ప్యాక్డ్ గా డిజైన్ చేసి వదలాలని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఇది ప్రచారంలో ఉండటంతో అభిమానులు కూడా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ ట్రైలర్ గురించి త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే అన్ని భాషలలో కంప్లీట్ అయ్యింది. భారీ టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

సలార్ 1 రిలీజ్ తర్వాత వచ్చే ఏడాది సలార్ 2 పెండింగ్ షూట్ కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి ఆపరేషన్ చేసుకోవడంతో ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి బయటకొచ్చే అవకాశం ఉంది.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Salaartrailer 
  • Salaarceasefire 
  • Prashanthneel 
  • Salaarmovie 

Similar News

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

Copyright @2026

Powered by Blink CMS