రుక్కు లైక్స్ చరణ్.. సుకుమార్ కి పని పడిందా..?

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది తర్వాత చేస్తున్న సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఉంటుందని తెలిసిందే. సుకుమార్ చరణ్ ఈ కాంబినేషన్ అంటే చాలు మరో రంగస్థలం లాంటి సినిమా వస్తుందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.;

Update: 2025-09-07 11:30 GMT

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది తర్వాత చేస్తున్న సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఉంటుందని తెలిసిందే. సుకుమార్ చరణ్ ఈ కాంబినేషన్ అంటే చాలు మరో రంగస్థలం లాంటి సినిమా వస్తుందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పెద్ది తర్వాత చరణ్ తో సుకుమార్ మరో క్రేజీ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కథ ఓకే అవ్వగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఒక కన్ ఫర్మేషన్ వచ్చేసినట్టు తెలుస్తుంది.

సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్..

ఇంతకీ చరణ్ తో జత కట్టే ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే అది కన్నడ భామ రుక్మిణి వసంత్ అని టాక్. కన్నడ నుంచి వచ్చే హీరోయిన్స్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. అంతేకాదు వాళ్ల టాలెంట్ తో ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి ఆ సినిమాతోనే యూత్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ సినిమా తర్వాత రుక్మిణి ని ఫాలో అయ్యే ఆడియన్స్ సంఖ్య పెరిగింది.

లేటెస్ట్ గా మదరాసి సినిమాతో వచ్చిన రుక్మిణి అందులో కూడా ఇంప్రెస్ చేసింది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఆ నెక్స్ట్ ఎవరితో చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఐతే మదరాసి తెలుగు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో రుక్మిణి తనకు చరణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. సో మెగా ఫ్యాన్స్ సుకుమార్ సినిమాలో చరణ్ కి జతగా రుక్మిణిని ఫిక్స్ చేయండని అడిగేస్తున్నారు.

చరణ్ తో సినిమా ఛాన్స్ అంటే..

రుక్మిణి వసంత్ కూడా తప్పకుండా చరణ్ తో సినిమా ఛాన్స్ అంటే నో చెప్పదు కావొచ్చు. సో చరణ్, రుక్మిణి వసంత్ కాంబోని సుకుమార్ ఫిక్స్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతారు. తెలుగులో కూడా రుక్మిణికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తారక్ సినిమా రిలీజ్ తర్వాత అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

రుక్మిణి వసంత్ కూడా సౌత్ లో ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో తనకు వస్తున్న ఈ క్రేజీ ఫాలోయింగ్ చూసి సర్ ప్రైజ్ అవుతుంది. సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాల్లో ఆమె నటన యూత్ కి నచ్చేసింది. ఆ సినిమాలో ప్రియ రోల్ లో ఆకట్టుకున్న రుక్మిణి ప్రేక్షకుల హృదయాల్లో కూడా ప్రియమైన వ్యక్తిగా నిలిచింది.

సో తెలుగులో కూడా స్టార్ ఛాన్స్ లు అందుకుంటుంది కాబట్టి అటు రష్మిక తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రుక్మిణి అదరగొట్టే ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. మరి రుక్మిణి నెక్స్ట్ లైనప్ ఎలా ఉంది.. ఆ ఫలితాలు ఆమెను ఏ ప్లేస్ లో నిలబెడతాయి అన్నది చూడాలి.

Tags:    

Similar News