ట్రైలర్ టాక్: బైరాన్‌పల్లి యుద్ధంలో ఫుట్‌బాల్ 'ఛాంపియన్'

టాలీవుడ్ లో ఇప్పుడు పిరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోకే వస్తోంది వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మిస్తున్న 'ఛాంపియన్'.;

Update: 2025-12-19 05:13 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు పిరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోకే వస్తోంది వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మిస్తున్న 'ఛాంపియన్'. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటేనే ఇదొక ఎపిక్ డ్రామా అని అర్థమైపోతోంది. రోషన్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా కనిపిస్తోంది.



 


కథ విషయానికి వస్తే 1948 నాటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను సెట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, రజాకార్ల ఆగడాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో హీరో రోషన్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. లండన్ వెళ్లి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది అతని కల. కానీ విధి అతన్ని ఆట మైదానం నుంచి యుద్ధభూమికి ఎలా లాక్కొచ్చింది అనేది చాలా ఆసక్తికరంగా చూపించారు.

విజువల్స్ పరంగా సినిమా స్ట్రాంగ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. బైరాన్‌పల్లి ఇన్సిడెంట్, ఆనాటి పల్లెటూరి వాతావరణం, రజాకార్ల దాడులు.. ప్రతీ ఫ్రేమ్ లో మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తోంది. చరణ్ అన్నట్లుగానే ఇది 'లగాన్' సినిమాను గుర్తు చేస్తూనే, దానికి ఫుల్ యాక్షన్ జోడించినట్లుగా ఉంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో వచ్చే బ్లాస్టింగ్స్, గన్ ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

హీరోగా రోషన్ మేకోవర్ కూడా కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఒక స్టైలిష్ ఫుట్‌బాల్ ప్లేయర్ గా, సెకండ్ హాఫ్ లో తుపాకీ పట్టిన రెబల్ గా రెండు వేరియేషన్స్ లో ఇరగదీశాడు. "ఈ ఊరుని విడవడం.. నా ప్రాణం విడిచినప్పుడే సుందరయ్య" వంటి డైలాగ్స్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్ ను చూపిస్తున్నాయి. అనస్వర రాజన్ తో లవ్ ట్రాక్ కూడా చాలా ఫ్రెష్ గా, క్లాసీగా అనిపిస్తోంది.

టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తోట తరణి గారి ప్రొడక్షన్ డిజైన్ ఆ కాలం నాటి వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేసింది. ప్రతి షాట్ లోనూ ఒక రిచ్ నెస్ కనిపిస్తోంది. స్వప్న సినిమా, ప్రియాంక దత్ లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది.

ఇక 'ఛాంపియన్' ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఫుట్‌బాల్, లవ్, ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా ట్రైలర్ లో హైలెట్ చేశారు. సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కంటెంట్ ఏమోషన్ క్లిక్కయితే రోషన్ కు ఇది కచ్చితంగా ఒక గేమ్ ఛేంజర్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఆడియెన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.


Full View


Tags:    

Similar News