ఓరచూపుతో ఆకట్టుకుంటున్న మిరాయ్ బ్యూటీ!

ఇక అందులో భాగంగానే తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రితిక.

Update: 2026-05-20 13:30 GMT

మిరాయ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన రితికా నాయక్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి ఈ సినిమాలో ఈమె పాత్రకు ఎలాంటి స్కోప్ లేకపోయినా.. హీరో పాత్రను వెనకుండి నడిపించి తన నటనతో, అందంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పాత్రకి స్కోప్ లేకపోయినా తన నటనతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ పేరు అప్పట్లో భారీగా మారుమ్రోగింది. రితికా నాయక్ అందానికి అభిమానులు ముగ్ధులయ్యారు. ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ సందడి చేసింది.

 

ఇక అందులో భాగంగానే తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రితిక. ఇక అందులో భాగంగానే తాజాగా వైట్ కార్సెట్ డ్రెస్ ధరించి సోఫా మీద వయ్యారంగా కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా ఈ ఫోటోలను చూస్తే ఆమె హుందాతనం, ఆత్మవిశ్వాసం, స్టార్ పవర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . కాటుక కళ్ళతో ఓరచూపుతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది రితికా నాయక్ అంటూ నెటిజన్స్ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రితికా నాయక్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

2000 అక్టోబర్ 27న ఢిల్లీలో జన్మించిన ఈమె.. చదువును పూర్తి చేసుకున్న తర్వాత తొలిసారి 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 టైటిల్ గెలుచుకొని ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తన నటనతో, గ్లామర్ తో మంచి ఫిజిక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2022లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకొని టాలీవుడ్ లో మంచి డిమాండ్ అందుకుంది.

 

ఇక తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో అతిథి పాత్ర పోషించిన రితిక.. 2025లో వచ్చిన మిరాయ్ సినిమాలో విభా అనే పాత్ర పోషించి, ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం కొరియన్ కనకరాజు, డ్యూయెట్, టి15 వంటి చిత్రాలలో బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం రితిక నాయక్ తెలుగు ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీ గా వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. దక్షిణ కొరియాలోని లొకేషన్లో చిత్రీకరించిన పాటలు , సన్నివేశాలు సినిమాకి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. మరి ఈ సినిమాతో రితిక మరింత ఇమేజ్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News