శ్రీదేవి అందుకు అనర్హురాలు - రాఘవేంద్రరావు

అతిలోక సుందరి అందాలతార శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.;

Update: 2025-10-18 22:30 GMT

అతిలోక సుందరి అందాలతార శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం శ్రీదేవి మనమధ్య లేకపోయినా ఆమె నటించిన ఎన్నో చిత్రాల ద్వారా ఇంకా సజీవంగానే ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నో చిత్రాలతో అత్యద్భుతమైన నటనతో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె.. అనూహ్యంగా దుబాయ్ లో ఒక బాత్ టబ్ లో పడి మరణించడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా శ్రీదేవి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాఘవేంద్రరావు శ్రీదేవి చివరి కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు అందుకు ఆమె అనర్హురాలు అంటూ చెప్పి షాక్ ఇచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాఘవేందర్రావు దాదాపు మూడు తరాల హీరోయిన్లను కవర్ చేసిన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయన శ్రీదేవితో ఏకంగా 24 చిత్రాలు చేసి ఆమె గ్లామర్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమెతో ఉన్న అనుబంధం పై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.." నేను శ్రీదేవితో 24 చిత్రాలు చేశాను. అయితే ఆ 25వ చిత్రం కూడా చేయాలి అని ఆమె నా దగ్గరకు వచ్చింది. అలా ఆమె నటించిన చివరి చిత్రం మామ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నా వద్దకు వచ్చి 25వ చిత్రం చేయాలని కోరింది. అటు శ్రీదేవి కోరడంతో కాదనలేక సరే అని చెప్పాను. కానీ అంతలోనే ఆమె మరణ వార్త విని తట్టుకోలేకపోయాను.. సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ఆమెకు అలాంటి మరణం సంభవించడం నిజంగా ఊహించని పరిణామం.. అలాంటి మరణానికి ఆమె అర్హురాలు కాదు" అంటూ ఎమోషనల్ అయ్యారు రాఘవేంద్రరావు.

శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో మరణించారు. ఈమె భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. శ్రీదేవి కోరిక మేరకే జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో తన తొలి చిత్రం చేసింది. అదే దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్డ్ తెచ్చుకొని ఆ తర్వాత మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇదే తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అలాగే నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తూ ఉండడం గమనార్హం. మరొకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. కానీ పెద్దగా విజయాన్ని మాత్రం వరించడం లేదు. మరి ఈ అమ్మడికి సరైన సక్సెస్ ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Tags:    

Similar News