మాస్‌రాజాలో ఆ స్పీడ్‌ ఏం తగ్గలేదు

మాస్‌ మహారాజా రవితేజ ఈ ఏడాది ఆరంభంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2026-07-21 07:24 GMT

మాస్‌ మహారాజా రవితేజ ఈ ఏడాది ఆరంభంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో వినోదాన్ని పంచడంలో విఫలం అయిందని చెప్పక తప్పదు. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా రవితేజ జెట్‌ స్పీడ్‌తో మరో సినిమాను రెడీ చేశాడు. రవితేజ కెరీర్‌లో ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలు చాలానే చేశాడు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా 'ఇరుముడి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలోని రవితేజ పాత్ర ఏంటి? సినిమా కథలో అయ్యప్ప స్వామి మాల ప్రాధాన్యత ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్‌లోనే ఇరుముడి అని ఉన్న కారణంగా ఇది పూర్తిగా భక్తి మూవీ అని భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు.

ఇరుముడి సినిమాతో రవితేజ...

రవితేజ, ప్రియా భవాని శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇరుముడి' నుంచి వచ్చిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. రవితేజ ఈ సినిమాలో తండ్రిగా కనిపించబోతున్నట్లుగా కన్ఫర్మ్‌ అయింది. ఈ సినిమా ఆరు నెలల లోపులోనే దర్శకుడు శివ నిర్వాణ తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేశాడు. ఆగస్టు 21న విడుదల కాబోతున్న ఈ సినిమాపై రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకు కారణం శివ నిర్వాన చెప్పిన కథ అని రవితేజ సన్నిహితుల వద్ద అన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఈ మధ్య కాలంలో శివ నిర్వాన కాస్త స్లో అయ్యాడు కానీ ఇంతకు ముందు ఆయన నుంచి వచ్చిన నిన్ను కోరి, మజిలి, టక్‌ జగదీశ్‌, ఖుషి సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాదాపు మూడు ఏళ్ల తర్వాత శివ నిర్వాన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రవితేజ...

'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్‌ సందడికి రెడీ అయిన రవితేజ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడని సమాచారం అందుతోంది. ఇరుముడి సినిమా విడుదల కావడమే ఆలస్యం వెంటనే ఆ సినిమాను పట్టాలెక్కించి ఇదే జోష్‌తో వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్‌లను పట్టించుకోకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు అనే పాలసీతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎంతో మంది హీరోలు ఏడాదికి రెండు సినిమాలు అయినా విడుదల చేయాలని కోరుకుంటారు. కానీ సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో ఏడాదికి కనీసం ఒకటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. ఇలాంటి సమయంలో రవితేజ ఏడాదిలో క్రమం తప్పకుండా రెండు సినిమాలు విడుదల చేయడంను చూస్తే ఆయన స్పీడ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రవితేజ ఫ్యాన్స్‌ కోసం...

రవితేజ కెరీర్‌ ఆరంభం నుంచి స్పీడ్‌గానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకటి రెండు సినిమాల వల్ల ఆలస్యం అయ్యాడే తప్ప, తనవంతు ప్రయత్నంగా రెగ్యులర్‌గా తన సినిమాలు సెట్స్ పై ఉండే విధంగా ప్లాన్‌ చేసుకుంటూ ఉంటాడు. ఒక సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యే హీరో రవితేజ అనడంలోనూ సందేహం లేదు. ఇప్పుడు ఇరుముడి విడుదల కావడమే ఆలస్యం, కొత్తగా రెండు సినిమాలను రవితేజ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు సీనియర్‌ దర్శకులతో సినిమాలు చేస్తూ, మరో వైపు కొత్త వారితోనూ సినిమాలు చేస్తూ రవితేజ యంగ్‌ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న మాస్ రాజా అభిమానులకు ఇరుముడి సినిమాతో ఆ హిట్‌ దక్కేనా అనేది చూడాలి. ఇరుముడి ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం అదే స్పీడ్‌తో వరుసగా సినిమాలు చేయడం ఖాయం. అభిమానులకు హీరోల భారీ బ్లాక్‌ బస్టర్‌ల కంటే వరుస సినిమాలు విడుదల కావడం కావాలి. అదే రవితేజ పాటిస్తూ వస్తున్నాడు.

Tags:    

Similar News