వాళ్లిద్దరు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు!
`కేజీఎఫ్`, `కేజీఎఫ్ 2`, `సలార్`.. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించాడు ప్రశాంత్ నీల్.;
`కేజీఎఫ్`, `కేజీఎఫ్ 2`, `సలార్`.. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించాడు ప్రశాంత్ నీల్. యష్, ప్రభాస్ లాంటి స్టార్లకు మరో లెవల్ సినిమాలను అందించాడు. అందుకే ఇప్పుడు అతడు ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాని రూపొందిస్తుంటే, అభిమానుల్లో ఎగ్జయిట్‌మెంట్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్టీఆర్‌ని నీల్ పెద్ద తెరపై ఎలా చూపించబోతున్నారు? ఎంపిక చేసుకున్న టైటిల్ కి తగ్గట్టే తారక్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. మరోసారి ప్రశాంత్ నీల్ నుంచి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే సినిమా ఎలా ఉంటుంది? అన్నది అభిమానుల ఊహకే వదిలేస్తున్నామంటూ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు రవి బస్రూర్ `డ్రాగన్` ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలను మించి ఎన్టీఆర్ సినిమా ఉంటుందన్నారు. మళ్లీ ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని సంతోష పడ్డారు. ప్రశాంత్ నీల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాము మాట్లాడుకునేది తక్కువ అని పనిచేసేది మాత్రం ఎక్కువగా ఉంటున్నారు.
ఈ సినిమా విజువల్స్ తో పాటు, సంగీతం కూడా భారీ స్థాయిలో ఉంటుదన్నారు. తన గత సినిమాలకు భిన్నంగా సంగీతం ఉంటుందన్నారు. అందుకోసం కొత్త సంగీత పరికరాలు ఉపయోగిస్తున్నామన్నారు. అదెంతో శక్తి వంతంగా ఉంటుందన్నారు. సినిమాలో ఎమోషన్ కు ప్రశాంత్ నీల్ పెద్ద పీట వేసినట్లు రివీల్ చేసారు. దీంతో ప్రశాంత్ నీల్ ఎమోషన్ ఎక్కడా మిస్ అవ్వలేదని మరోసారి బయట పడింది. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాల్లో ప్రధానంగా మామ్ సెంటి మెంట్ హైలైట్ అవుతుంది. మరి `డ్రాగన్` లో ఏ తరహా ఎమోషన్ కు పెద్ద పీట వేస్తున్నారు? అన్నది చూడాలి.
సినిమాను బీజీఎమ్ తో నడిపించే సత్తా ఉన్న సంగీత దర్శకుడు రవి బస్రూర్. `కేజీఎఫ్`, `సలార్` సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయంటే రవి బస్రూర్ ఆర్ ఆర్ కూడా అంతే కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పాటలు లేకుండా స్టోరీ, సన్నివేశాల్ని బేస్ చేసుకుని ఆయన ఇచ్చిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. దీంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో సంగీతం అంతకు మించి ఉంటుందని అంచనాలున్నాయి.