• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SRH vs RCB.. ఏంటి రష్మిక...

SRH vs RCB.. ఏంటి రష్మిక అంత మాట అనేశావ్?

| ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ హవా నడుస్తోంది. కప్ కోసం పది జట్లు బరిలో దిగి పోటీ పడుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-31 10:57 GMT

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ హవా నడుస్తోంది. కప్ కోసం పది జట్లు బరిలో దిగి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో అనేక మ్యాచులు చివర వరకు ఉత్కంఠ గా సాగాయి. ఆయా జట్ల అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఇటీవల హైదరాబాద్ టీమ్.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్స్ 277 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర లిఖించారు.

మార్చి 27వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ ను పలువురు చూడకపోయినట్లు నెట్టింట నిరాశ వ్యక్తం చేశారు. ఆ సమయంలో నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా షూట్ కారణంగా మ్యాచ్ మొత్తం చూడలేకపోయానని ట్వీట్ చేశారు. హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యాక చూశానని పోస్ట్ పెట్టారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. మీరు నెక్స్ట్ హైదరాబాద్ మ్యాచ్ కూడా చూడొద్దని, మీరు చూడకపోవడం వల్లే భారీ పరుగులు వచ్చాయని, షూట్ లో గడిపియేండని కామెంట్స్ పెట్టారు.

వీటిపై తాజాగా స్పందించారు రాహుల్. "మ్యాచ్ అప్డేట్: ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొన్ననే పూర్తయింది. షూటింగ్ సెట్స్ లో ఉండాలని చెబుతున్న నెటిజన్లు అందరికీ సారీ. రష్మిక డేట్స్ ఈరోజు లేవ్" అని పోస్ట్ పెట్టారు. ఇక రాహుల్ ట్వీట్ కు నేషనల్ క్రష్ రష్మిక రిప్లై ఇస్తూ ట్వీట్ చేసింది. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ అని, కానీ ఈరోజు హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేసింది.

"సన్ రైజర్స్ ఈరోజు గెలిస్తే సూపర్.. లేకుంటే నెక్స్ట్ ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ రోజు ఒక్క సీన్ అయినా స్కైప్ లో షూట్ చేద్దాం. బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగే రోజు ఏం చేద్దాం" అని రష్మిక ట్వీట్ చేసింది. దానికి బదులిస్తూ.. "ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగే రోజు.. మేనేజర్‌తో మాట్లాడి సైలెంట్‌ గా కిడ్నాప్ చేసి మిమ్మల్ని సెట్స్‌ కు తీసుకెళ్తాను.. మీ బర్త్ డే రోజే హైదరాబాద్ మ్యాచ్ ఉంది. ప్లీజ్ డేట్స్ ఇవ్వు తల్లీ" అంటూ సరదాగా ట్వీట్ చేశారు రాహుల్.

ప్రస్తుతం రాహుల్, రష్మిక ఫన్నీ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ చిత్రం ఎలా ఉంటుందో.

I am a loyal RCB fan. But I also want SRH to win today♥️ Tell you what… let’s see today.. if SRH win - awesome.. 💃🏻 or else next match pakka we’ll shoot at least one shot on skype 🙏🏽♥️ but when it’s RCB and SRH.. then I wonder what we should do.. 😄 @23_rahulr https://t.co/tAkXqYWUfB

— Rashmika Mandanna (@iamRashmika) March 31, 2024
Tags:    
  • Rashmika 
  • Actress 
  • Ipl2024 
  • Rahulravindran 
  • Thegirlfriend 
  • Filmindustry 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS