ర‌ష్మిక ధాంప‌త్య జీవితం అందంగా..అద్భుతంగా!

వివాహ బంధానికి తాను ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నది అమ్మ‌డి మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంది.;

Update: 2025-10-29 20:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా ఇండ‌స్ట్రీ కి అనుకోకుండా వ‌చ్చింది. ఊహించ‌ని విధంగా పెద్ద స్టార్ అయింది. న‌టిగా పాన్ ఇండియాను ఏల్తుంద‌ని క‌నీసం క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌దు. అలా ర‌ష్మిక కు ఊహించ‌ని జీవితాన్ని చిత్ర ప‌రిశ్ర‌మ అందించింది. ఇంకొన్న‌ళ్ల పాటు ర‌ష్మిక కెరీర్ కు తిరుగుండ‌దు. బాలీవుడ్ లో కూడా తాను అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌దు. ఆ హైట్స్ కు ఈజీగా చేర‌గ‌ల‌దు. మ‌రి ఊహించ‌ని సినిమా జీవిత‌మే ఇంత అద్భుతంగా ఉందంటే? పెళ్లి.. ఆ త‌ర్వాత ధాంపత్య జీవితాన్ని ఇంకెంత అందంగా నిర్మించుకుంటుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

వివాహం అనంత‌రం అద్భుతంగా:

ర‌ష్మిక ఇప్ప‌టికే ల‌వ్ లో ఉంది. తెలుగు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అమ్మ‌డికి నిశ్చితార్దం కూడా జ‌రిగింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్న‌ది ఇంకా డిసైడ్ అవ్వ‌లేదు. ఈ ఏడాది న‌వంబ‌ర్ తో ముహూర్తాలు ముగుస్తున్నాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి ముహూర్తాలు ఫిబ్ర‌వ‌రి నుంచి మొద‌ల‌వుతున్నాయి. మ‌రి ఆ ముహూర్తానికి కానిచ్చేస్తారా? ఇంకా స‌మ‌యం తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. అయితే పెళ్లి త‌ర్వాత జీవితం మాత్రం ర‌ష్మిక ఎంతో అదందంగా..అద్భుంత‌గా ప్లాన్ చేసుకుంటుంద‌ని ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

కుటుంబం కోసం సిద్దంగా:

వివాహ బంధానికి తాను ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నది అమ్మ‌డి మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంది. తాను ఇంకా త‌ల్లిని కాలేద‌ని...కానీ భ‌విష్య‌త్ లో పిల్ల‌లు పుడ‌తార‌ని వారి కోసం ఇప్ప‌టి నుంచే తాను ఓ ప్ర‌ణాళిక రెడీ చేసుకుని సిద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలిపింది. పిల్ల‌ల‌కు మంచి జీవితాన్ని ఇవ్వాల‌ని...ఎదిగే క్ర‌మంలో వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకునే ప్లాన్ త‌న వ‌ద్ద ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. ర‌ష్మిక ఫిట్ గా ఉంది..అందంగా ఉందని రోజు నెట్టింట చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదంతా కేవ‌లం సినిమాల కోస‌మేన‌ని అంతా అనుకుంటున్నారు.

హ‌బ్బీకి టెన్ష‌న్ అవ‌స‌రం లేదు:

కానీ ర‌ష్మిక ఫిట్ గా ఉండ‌టానికి మ‌రో బ‌ల‌మైన కార‌ణం ఆమె మాట‌ల్లో బ‌య‌ట ప‌డింది. పిల్ల‌లు..కుటుంబ జీవితం కోస‌మే తాను శారీర‌కంగా, మాన‌సికంగా ఫిట్ గా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడే ఇంత ప్లానింగ్ తో ఉంది అంటే? వివాహం అనంత‌రం కుటుంబ జీవితాన్ని ర‌ష్మిక‌ ఇంకెంత అందంగా నిర్మించుకుంటుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌ని లేదు. హ‌బ్బీ బ‌య‌ట ప‌నుల్లో ఎంత‌ బిజీగా ఉన్నా? ర‌ష్మిక కూడా నటిగా ఎంత బిజీగా ఉన్నా? ఇంటి ఇల్లాలి బాధ్య‌త‌లు అంతే విధిగా నిర్వ‌ర్తించ‌డానికి తానెప్పుడు సిద్ద‌మే అన్న‌ది ఆమె మాట‌ల్లో స్ప‌ష్ట‌మైంది.

Tags:    

Similar News