పాన్ ఇండియా స్టార్ నే బీట్ చేసిన రణ్‌వీర్.. ఆ రికార్డ్స్ అన్నీ బ్రేక్!

నిజానికి గత కొంతకాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతున్న సమయంలో తుఫానులా వచ్చి పడింది ధురంధర్. వరుస కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2026-01-13 15:39 GMT

పాన్ ఇండియా స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తన సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు బీట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ధురంధర్. ఈ సినిమా విడుదలయ్యి 38 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బుక్ మై షోలో ఈ ఒక్కరోజే 45 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యి ఆశ్చర్యపరిచింది. ఇటు సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగినా ఈ సినిమా దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు మరో 10 రోజుల్లో ఓటీటీలోకి వస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ థియేటర్లకే వెళ్లి ఈ సినిమాను చూస్తూ ఉండడం విశేషం అనే చెప్పాలి.

నిజానికి గత కొంతకాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతున్న సమయంలో తుఫానులా వచ్చి పడింది ధురంధర్. వరుస కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరోవైపు వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.. ఇకపోతే ఈ సినిమా దూకుడుకి ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా అడ్డుకట్ట వేస్తుందని ఇటు సౌత్ ను మొదలుకొని అటు బాలీవుడ్ అభిమానులు కూడా ఆశించారు కానీ ప్రభాస్ సినిమాకే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

వాస్తవానికి టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా తెలుగులో సగటు విజయాలు సాధించిన ఎన్నో సినిమాలు హిందీలో భారీ వసూళ్లు రాబట్టి ఆయనకు హిందీలో ఊహించిన మార్కెట్ ను అందించాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ది రాజా సాబ్ సినిమా విడుదలైంది. అయితే మూడు రోజుల్లో కలిపి కేవలం 15.75 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. విడుదలై 38 రోజులవుతున్నా.. ఈ సినిమా 38వ రోజు కలెక్షన్లను కూడా ది రాజాసాబ్ విడుదలైన 3వ రోజే బ్రేక్ చేయలేకపోతోంది. ముఖ్యంగా 38వ రోజునే హిందీలో 6.5 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది ధురంధర్ .

సాధారణంగా ఇంతకాలం తర్వాత కూడా సినిమాల కలెక్షన్లు నామమాత్రంగానే వస్తాయి. కానీ ధురంధర్ సినిమా మాత్రం ట్రెండ్ను పూర్తిగా బ్రేక్ చేసి వరుస కలెక్షన్లతో దూసుకుపోతోంది ఇక దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీని ఈ సినిమా 38వ రోజు కూడా బ్రేక్ చేసింది అంటే దురంధర్ సినిమాకి అభిమానులు ఏ రేంజ్ లో పట్టం కట్టారో అర్థమవుతుంది.

పైగా అటు నెల రోజుల్లోనే ఇండియాలో 831.40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇండియా చలనచిత్ర చరిత్రలో సింగిల్ లాంగ్వేజ్ లో మాత్రమే విడుదల ఈ స్థాయి వసూలు సాధించిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.

Tags:    

Similar News