రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. కనీసం అప్పుడైనా మెప్పిస్తారా?

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిక్ మూవీ నుండీ గ్రాండ్ గా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Update: 2026-07-11 08:09 GMT

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విజువల్ వండర్ ‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తీస్తున్న ఈ సినిమా గ్లింప్స్ జూలై 18న వస్తుందంటూ జరిగిన ప్రచారానికి మేకర్స్ అఫీషియల్‌గా చెక్ పెట్టారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిక్ మూవీ నుండీ గ్రాండ్ గా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.



 


పుకార్లకు చెక్ పెట్టిన మేకర్స్:

గత కొద్ది రోజులుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌పై రకరకాల రూమర్స్ వచ్చాయి. ప్రఖ్యాత గ్లోబల్ ఈవెంట్ 'శాన్ డియాగో కామిక్-కాన్' వేదికగా జూలై 18నే గ్లింప్స్ లేదా ట్రైలర్ వస్తుందని నెటిజన్లు భావించారు. అయితే, ఆ పుకార్లన్నింటినీ పటాపంచలు చేస్తూ, జూలై 24న ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆ బిగ్ డే కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఆకట్టుకుంటున్న వనవాసం పోస్టర్:

ట్రైలర్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య నగరం నుండి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి తమ 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరుతున్న ఎమోషనల్ ఘట్టాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన అయోధ్య సెటప్, అందులోని విజువల్స్ చూస్తుంటే దర్శకుడు నితీష్ తివారీ మన ఇతిహాసాన్ని ఏ రేంజ్‌లో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారో అర్థమవుతోంది.

హాలీవుడ్ రేంజ్‌లో ఐమ్యాక్స్ మేకింగ్:

భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత 'DNEG' సంస్థ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. 'అవతార్', మార్వెల్ సినిమాల రేంజ్‌లో గ్రాఫిక్స్ ఉండేలా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని నమ్ముతున్నారు.

భారీ తారాగణం.. బిగ్గెస్ట్ అట్రాక్షన్:

ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించనుండటం విశేషం. వీరితో పాటు సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయి పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతటి భారీ తారాగణం ఉండటంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గతంలో వచ్చిన కొన్ని రామాయణ చిత్రాలు అంతగా ఆకట్టుకోకపోవటంతో , ఈ సినిమా అయినా మెప్పిస్తుందా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దివాళీ 2026 కానుకగా థియేటర్లలోకి రాబోతున్న 'రామాయణ' పార్ట్-1 పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన పొరపాట్లను రిపీట్ చేయకుండా, కనీసం ఈ ట్రైలర్‌తోనైనా మేకర్స్ ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో తెలియాలంటే జూలై 24 వరకు ఆగాల్సిందే.. విజువల్స్ గనుక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే.

Tags:    

Similar News