టాలీవుడ్‌లో శ్రీలీల సైలెంట్‌ అయ్యిందేంటి?

ధమాకా విజయంతో దాదాపుగా అర డజను సినిమా ఛాన్స్‌లను శ్రీలీల దక్కించుకుంది. అంతే కాకుండా సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ దక్కించుకుంది.

Update: 2026-07-11 08:09 GMT

'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయ్యి, రవితేజతో కలిసి 'ధమాకా' సినిమా తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు అమ్మాయి అయినప్పటికీ లక్కీగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీలను కన్నడ ముద్దుగుమ్మగా కెరీర్‌ ఆరంభంలో టాలీవుడ్‌కి పరిచయం చేయడం జరిగింది. దాంతో టాలీవుడ్‌లో శ్రీలీలకు మంచి స్టార్టింగ్‌ దక్కింది. మొదటి మూవీ నిరాశ పరిచినా ధమాకాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు లక్‌ కలిసి రావడంతో శ్రీలీల టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా ఛాన్స్ దక్కించుకుంది. ధమాకా విజయంతో దాదాపుగా అర డజను సినిమా ఛాన్స్‌లను శ్రీలీల దక్కించుకుంది. అంతే కాకుండా సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ దక్కించుకుంది.

టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో...

కన్నడ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. కన్నడ సినిమాలకు మెల్ల మెల్లగా దూరం అవుతూ వచ్చిన శ్రీలీల టాలీవుడ్‌లో జెండా పాతింది. అయితే టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లాలి అనుకుంటుందో లేదా మరేమో కాని టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. మహేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమా, అల్లు అర్జున్‌ పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా శ్రీలీల టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో పారితోషికం తీసుకోవడం మొదలు పెట్టింది. టాలీవుడ్‌ నిర్మాతలు శ్రీలీలకు కోరినంత పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. బిజీ బిజీగా సినిమాలు చేస్తూ, భారీ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. అయితే అందంతా గత ఏడాది వరకు మాత్రమే... ఈ ఏడాదిలో శ్రీలీల జోరు కనిపించడం లేదు.

శ్రీలీల బాలీవుడ్‌ మూవీ అప్‌డేట్‌..

ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. శ్రీలీల తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు కావాలి, తన కెరీర్‌ బిల్డ్ అయ్యే సినిమాలు కావాలని ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే టాలీవుడ్‌లో ఈమె కొత్త సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో బాలీవుడ్‌లో ఈమె ఒక సినిమాను చేస్తోంది. బాలీవుడ్‌ పై ఆసక్తితో శ్రీలీల టాలీవుడ్‌ను దూరం పెడుతుంది అనే విమర్శలు మొదలు అయ్యాయి. బాలీవుడ్‌లోనూ వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయా అంటే అది లేదు. శ్రీలీల ప్రస్తుతం ఒకే ఒక్క హిందీ సినిమా చేస్తుంది. అది కూడా ఎప్పటికీ పూర్తి అయ్యి, ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఇక తమిళనాట ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సైతం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని కోలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తర్వాత శ్రీలీల...

శ్రీలీల ఏడాదిలో ఇప్పటికే పరాశక్తి, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరాశక్తి నిరాశ పరచడంతో, పాటు కోలీవుడ్‌లో ఈమె సెట్‌ కాదేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది. కోలీవుడ్‌లో శ్రీలీల ప్రయత్నాలు చేయకుండా ఉండటం ఉత్తమం అనేది కొందరి అభిప్రాయం. ఇక ఉస్తాద్‌ భగత్ సింగ్‌ సినిమాలో శ్రీలీల పాత్ర పరిధి తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌తో చిన్న పాత్రలో నటించినా మంచి ఆఫర్లు వస్తాయని అంటారు. శ్రీలీలను టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ సంప్రదించి ఉంటారు. కానీ ఆమె బాలీవుడ్‌ పై ఆసక్తితో సున్నితంగా తిరస్కరించి ఉంటుందని సినీ వర్గాల అంటున్నారు. ప్రస్తుతానికి కమర్షియల్‌ యాడ్స్ ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న శ్రీలీల సినిమాల పరిస్థితి ఏంటంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్‌లో శ్రీలీల వచ్చిన సినిమాలను చేయడం లేదా? ఆమెకు ఆఫర్లు రావడం లేదా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి టాలీవుడ్‌లో శ్రీలల కాస్త సైలెంట్ అయ్యింది అనేది వాస్తవం. ఆ సైలెన్స్‌ కి కారణం ఏంటి అనేది ఆమె చెప్పాలి.

Tags:    

Similar News