రాహా కోసం 350 కోట్ల ప్రత్యేక బంగ్లా.. ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలు!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ - ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-12-06 12:27 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ - ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ జంట.. తమ కూతురి కోసం ఏకంగా 350 కోట్ల విలువైన ప్రత్యేక బంగ్లాను నిర్మించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. విషయంలోకి వెళ్తే నవంబర్ 6వ తేదీన ఆలియా - రణబీర్ కపూర్ల గారాలపట్టి రాహా పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. ఇక రాహా కోసం నిర్మించిన ఆ ఖరీదైన బంగ్లాలోనే ఆమె పుట్టిన రోజు వేడుకలను జరిపారు. అంతేకాదు ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారు



 


కానీ ఆ విషయాలను అభిమానులతో పంచుకోలేదు ఆలియా. కానీ నిన్న సుమారుగా ఒక 15 ఫోటోల వరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఇక దాంతో ఆ ఇల్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడమే కాకుండా 350 కోట్లు ఖర్చు చేసే అంత ప్రత్యేకతలు ఆ ఇంట్లో ఏమున్నాయి అని అందరూ తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ప్రత్యేకంగా నిర్మించిన ఆ బంగ్లాలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.



 

రిషీ కపూర్ కుటుంబానికి వంశపారంగా వస్తున్న ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలువబడే బాంద్రా ఏరియాలో ప్రతిష్టాత్మక కృష్ణరాజ్ బంగ్లా స్థానంలోనే ఇప్పుడు ఆలియా - రణబీర్ కపూర్లు కొత్త బంగ్లాను కట్టుకున్నారు. 6 అంతస్తుల ఈ భవనం ఖరీదు అక్షరాలా రూ.350 కోట్లు. అత్యాధునిక హంగులతో పాటు సెక్యూరిటీ ఫీచర్లతో ఈ భవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ముఖ్యంగా ఒక మోస్తారు భూకంపాన్ని కూడా తట్టుకునేలా ఈ బంగ్లాను నిర్మించడం ప్రత్యేకం. 1981 నుంచి కృష్ణరాజ్ ప్యాలెస్ లోనే రిషి కపూర్, నీతూ సింగ్ ఉండేవారు. అయితే రిషి కపూర్ మరణం తర్వాత తల్లి అనుమతితో కృష్ణరాజ్ ప్యాలెస్ స్థానంలోనే ఈ ఆరంతస్తుల బంగ్లాను నిర్మించారు ఈ జంట.



 


ఈ బంగ్లా ప్రత్యేకతల విషయానికి వస్తే.. గ్రౌండ్ ఫ్లోర్ మూడో అంతస్తును విల్లాలుగా మార్చారు. పైగా ఈ కుటుంబానికి ఆరు కారులు ఉన్నాయి. వీటితోపాటు మరో 15 కార్లను పార్కు చేసేలా భవనంలో ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. పైగా ఒక ఫ్లోర్ మొత్తాన్ని తన తల్లి కోసం కేటాయించారు. మరో ఫ్లోర్ లో భార్య, పాపతో కలిసి ఉంటున్నారట. ఇక మిగతా ఫ్లోర్లను అతిథిల కోసం కేటాయించినట్లు సమాచారం.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ భవనంలో అద్దాల కోసం వాడిన గ్లాస్ ను ప్రత్యేకంగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే ఫర్నిచర్ ని కూడా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. కిచెన్ సామాగ్రితో పాటు ఇతర యాక్సెసరీస్ ను నెదర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారట. అలాగే 2 పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి రణబీర్, ఆలియా ఫ్లోర్ లో ఏర్పాటు చేయగా.. మరొకటి భవనం పైభాగంలో నిర్మించారు. టెర్రస్ గార్డెనింగ్ కోసం సౌత్ ఏసియా దేశాల నుంచీ మొక్కల్ని తెప్పించారు.

Tags:    

Similar News