హనుమాన్ 2 నుంచి మిరాయ్ 2కి షిఫ్ట్..?

ఇదిలా ఉంటే మిరాయ్ చివర్లో మిరాయ్ 2 జైత్రాయ కోసం రానా క్యామియో తెలిసిందే. మిరాయ్ 2 లో ఆయన విలన్ గా కనిపించనున్నారు.;

Update: 2025-09-16 04:04 GMT

దగ్గుబాటి హీరో రానా సినిమా అంటే చాలు ఏం చేయడానికైనా సిద్ధం అవుతాడు. హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ మెప్పించే అవకాశం ఉంది అయినా కూడా డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తుంటాడు. అంతేకాదు ఏదైనా సినిమాలో చిన్న క్యామియో రోల్ ఉంది అంటే ఓయెస్ చేసేద్దాం అంటాడు. అంతేకాదు విలన్ గా కూడా తాను రెడీ అనేస్తాడు. నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టే రానా ఇలా ఏ సినిమాకైనా.. ఏ పాత్రకైనా సరే అంటున్నాడు.

రానా క్యామియో సర్ ప్రైజ్..

ఇదిలా ఉంటే మిరాయ్ చివర్లో మిరాయ్ 2 జైత్రాయ కోసం రానా క్యామియో తెలిసిందే. మిరాయ్ 2 లో ఆయన విలన్ గా కనిపించనున్నారు. ఐతే పార్ట్ 2 కథ ఎలా ఉంటుంది.. దాని సంగతి ఏంటన్నది పక్కన పెడితే మిరాయ్ 2 లో రానా క్యామియో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఇది సినిమా పూర్తై ఎండ్ టైటిల్స్ టైం లో రావడం వల్ల ఆడియన్స్ అంతగా గుర్తించలేదు.

తేజ సజ్జ మిరాయ్ లో రానా సర్ ప్రైజ్ చేశాడు. అంటే మిరాయ్ 2 లో రానా విలన్ గా దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క. అసలైతే రానా తేజ సజ్జ నటించిన హనుమాన్ సీక్వెల్ అదే జై హనుమాన్ లో నటించాల్సి ఉంది. హనుమాన్ సినిమాలో లార్డ్ ఆంజనేయాని చూపించిన టైం లో ఆ కళ్లు చూసి రానానే హనుమాన్ గా చేస్తున్నాడని అనుకున్నారు. కానీ రిషబ్ శెట్టిని ఆ రోల్ కి ఓకే చేశాడు.

రానా విలనిజం గురించి తెలిసిందే..

అలా హనుమాన్ 2 లో కనిపిస్తాడని అనుకున్న రానా సడెన్ గా మిరాయ్ చివర్లో సర్ ప్రైజ్ చేసి మిరాయ్ 2 లో నటిస్తున్నానని డిక్లేర్ చేశాడు. ఓ విధంగా మిరాయ్ 2 కి బజ్ తెచ్చేందుకు మిరాయ్ రిజల్ట్ ఒక రీజన్ అయితే.. రానా కూడా మరో రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రానా విలనిజం గురించి అందరికీ తెలిసిందే. బాహుబలిలో భళ్లాలదేవ రోల్ లో అదరగొట్టాడు. భీంలా నాయక్ సినిమాలో డేనియల్ శంకర్ గా కూడా సూపర్ గా చేశాడు. ఇక ఇప్పుడు మిరాయ్ 2 లో మరోసారి నెగిటివ్ రోల్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు.

రానా స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. యాక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా రానా తన టేస్ట్ ని తెలియచేసే సినిమాలు చేస్తున్నాడు. మిరాయ్ 2 తో పాటు మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు రానా. విరాటపర్వం తర్వాత రానా లీడ్ రోల్ చేసిన సినిమా ఒక్కటి రాలేదు. మరి రానా ప్లానింగ్ ఏంటో తెలియక ఆడియన్స్ కన్ ఫ్యూజన్ లో పడ్డారు.

Tags:    

Similar News