చ‌ర‌ణ్ తో పోటాపోటీగా బ‌రిలోకి దిగుతుందా?

రెహ‌మాన్ తో ఒక సినిమాకైనా ప‌నిచేయాల‌న్న‌ది బుచ్చిబాబు క‌ల‌. ఆ డ్రీమ్ `పెద్ది`తో నెర‌వేరుతుంది.;

Update: 2025-12-01 06:52 GMT

రెహ‌మాన్ తో ఒక సినిమాకైనా ప‌నిచేయాల‌న్న‌ది బుచ్చిబాబు క‌ల‌. ఆ డ్రీమ్ `పెద్ది`తో నెర‌వేరుతుంది. ఇంత తొంద‌ర‌గా త‌న క‌ల నెర‌వేరుతంద‌ని తాను కూడా అనుకుని ఉండ‌డు. ఈ విష‌యంలో బుచ్చిబాబు ఎంతో స్మార్ట్. ఇంకా చెప్పా లంటే గురువును మించిన ఘ‌నుడనే చెప్పొచ్చు. గ‌రువు సుకుమార్ కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను పెట్టు కుంటే ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోన‌న్న భ‌యంతో తొలి సినిమా నుంచి `పుష్ప` వ‌ర‌కూ దేవి శ్రీ ప్ర‌సాద్ నే కొన‌సాగించాడు. కానీ శిష్యుడు బుచ్చిబాబు మాత్రం అలా కాదు. రెండ‌వ సినిమాకే త‌న అభిమాన మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో ప‌ని చేస్తున్నాడు.

భారీ సెట్ లో సాంగ్ షూట్:

ఆ అభిమాని న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టే దిశ‌గా రెహ‌మాన్ బాణీలు స‌మ‌కూర్చుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన `పెద్ది` తొలి లిరిక‌ల్ సాంగ్ `చికిరి చికిరి` ఎంత పెద్ద హిట్ అయిందే తెలిసిందే. ఇండియా స‌హా విదేశాల్లోనే `చికిరి` సాంగ్ ఊపేస్తుంది. బుచ్చిబాబు సిచ్వేష‌న్ చెప్ప‌డం...రెహ‌మాన్ ట్యూన్ క‌ట్ట‌డం అన్ని అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగిపోయాయి. త్వ‌రలో సెకెండ్ సింగిల్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే అంత‌కంటే ముందే రామ్ చ‌ర‌ణ్‌-జాన్వీక‌పూర్ ల‌పై ఓ బ్యూటీ ఫుల్ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అందుకోసం హైద‌రాబాద్ లో ఓ భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ తో పోటీగా జాన్వీ:

ఈ పాట‌లో చ‌ర‌ణ్‌తో పోటాపోటీగా జాన్వీ డాన్సు చేయ‌నుంద‌ని స‌మాచారం. చ‌ర‌ణ్ మార్క్ సిగ్నెచ‌ర్ స్టెప్స్ ఈ పాట‌లో కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రి రెహ‌మాన్ ఆ ఇద్ద‌రి కోసం ఎలాంటి సాంగ్ కంపోజ్ చేసారో చూడాలి. అలాగే ఈ పాట‌కు కొరియోగ్రాఫ‌ర్ ఎవ‌రు ? అన్న‌ది కూడా తెలియాలి. ఏ పాట‌కైనా కొరియోగ్రాఫ‌ర్ కీల‌కం. అత‌డిపైనే హీరో డాన్స్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంత వ‌ర‌కూ చ‌ర‌ణ్ న‌టించిన ఏ సినిమా విష‌యంలో డాన్స్ ప‌రంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి అంత పర్పెక్ష‌న్ లేక‌పోయినా? త‌న మార్క్ మాత్రం ప్ర‌తీ పాట‌లో ఉండేలా చూసుకుంటాడు.

బాలీవుడ్ లోనూ వీక్ గానే:

అలాగే జాన్వీ క‌పూర్ కి కూడా ఇంత వ‌ర‌కూ స‌రైన కోస్టార్ త‌గ‌లేదు. `దేవ‌ర‌`లో ఎన్టీఆర్ సర‌స‌న న‌టించినా? అందులో తార‌క్ హైలైట్ అయ్యాడు త‌ప్ప జాన్వీ కాలేక‌పోయింది. బాలీవుడ్ లోనూ అదే ప‌రిస్థితి. అక్క‌డా చాలా మంది స్టార్ల‌తో ప‌నిచేసింది. కానీ వాటిలో చాలా చిత్రాల్లో జాన్వీ డాన్సు కంటే న‌ట‌న‌పైనే దృష్టి పెట్టింది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అమ్మ‌డు హైలైట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News