జక్కన్న మిషన్ ఆన్.. ప్రపంచం టాలీవుడ్ వైపు చూసే టైం వచ్చింది!

దర్శకుడిగా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-06-17 06:03 GMT

దర్శకుడిగా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసిన బాలీవుడ్ పరిశ్రమ నటీనటులు కూడా తెలుగులో సినిమాలు చేయాలని పరితపిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ నటీనటులు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి మొగ్గు చూపుతున్నారు అంటే దీని వెనుక జక్కన్న లాంటి దిగ్గజ దర్శకుల హస్తం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి , ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతా కాదు.

ఏకంగా ఆస్కార్ స్థాయిలో సందడి చేసిన ఈ చిత్రాలు తెలుగు వాడి హృదయాన్ని గర్వించేలా చేశాయి. అయితే ఇప్పుడు మరొకసారి ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేయబోతున్నారు రాజమౌళి. అసలు విషయంలోకి వెళ్తే.. కాంప్రమైజ్ అనే పదానికి అర్థమే తెలియని జక్కన్న ప్రతి ఫ్రేమ్ లోను తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే వారణాసి ఒక భారీ విజన్ తో ప్రపంచ బాక్సాఫీస్ పై దృష్టి పెట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏకంగా కనివిని ఎరుగని రేంజ్ లో రూ.4 కోట్ల క్లైమాక్స్ తో ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ అనుభవం సిద్ధమవుతోందనే వార్త సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పథకాన్ని ఎగర వేయడానికి జక్కన్న మిషన్ ఆన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

వారణాసి సినిమా ద్వారా ఏకంగా దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్లోను తన మార్కు చూపించడానికి పరితపిస్తున్నారు రాజమౌళి. ఈ మేరకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయాన్ని ఆచితూచి దగ్గరుండి మరి చేయిస్తున్నట్లు సమాచారం. ఇక అదిరిపోయే క్లైమాక్స్ ను ఉంచాలనే నేపథ్యంతో దానికోసం ఏకంగా రూ.4కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచం ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా వైపు చూడడానికి, తెలుగు సినిమా గర్వంగా తలెత్తి ముందుకు సాగడానికి జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి మరి వారణాసి సినిమాతో జక్కన్న కచ్చితంగా ఆస్కార్ అందుకుంటారనే కామెంట్లు అభిమానుల నుంచి వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం..

వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య ఊహించని తారాగణంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News