పుట్టి పెరిగింది హైదరాబాదులోనే.. పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని -రహస్య గోరక్
రహస్య గోరక్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే.;
రహస్య గోరక్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నటన మీద ఆసక్తితో 2016లో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో సినిమా ద్వారా నటన జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత 2019లో కిరణ్ అబ్బవరంతో కలిసి రాజా వారు రాణి గారు అనే సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాలో నటించిన హీరోతోనే ప్రేమలో పడి 2024 మార్చి 13న హైదరాబాదులో నిశ్చితార్థం చేసుకోగా.. ఆగస్టు 2024 కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో ప్రైవేటు వివాహం చేసుకున్నారు.
తిమ్మరాజు పల్లి టీవీ రిలీజ్ ఈవెంట్లో రహస్య..
ఇకపోతే వివాహం అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది రహస్య. ప్రస్తుతం కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైన ఈమె.. తాజాగా తిమ్మరాజు పల్లి టీవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమె భర్త ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస చిత్రాలతో మంచి కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా కేఏ ప్రొడక్షన్స్ అంటూ ఒక కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా అవతరించారు. పైగా 25 మంది కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విభిన్నమైన కథాంశంతో వి.మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అందులో పాల్గొన్న రహస్య గోరక్ తన భర్త గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పెరిగింది సిటీలోనే కానీ పెళ్లి మాత్రం పక్కా ఊరోడితో..
తిమ్మరాజు పల్లి టీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రహస్య మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదులోనే.మీ కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడిని. విలేజ్ ఎన్విరాన్మెంటు, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని తెలియడానికి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మా సినిమాకి రండి.. మీకు అదంతా అర్థం అవుతుంది. అంత బాగుంటుంది మా సినిమా అంటూ చెప్పుకొచ్చింది రహస్య గోరక్.
కిరణ్ అబ్బవరం కెరియర్..
కిరణ్ అబ్బవరం కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా అడుగులు వేస్తున్నారు. మరి నిర్మాతగా ఆయనకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 17 వరకు ఎదురు చూడాల్సిందే. మరోవైపు పలు చిత్రాలలో హీరోగా నటిస్తూ బిజీగా మారిపోయారు కిరణ్ అబ్బవరం.