పిక్‌టాక్ : నిజంగా అందాల రాశి అంటే కాదంటారా?
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా 2014లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఖన్నా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.;
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా 2014లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఖన్నా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా బ్రేక్ తీసుకుని రాలేక పోయాయి, అంతే కాకుండా అవి ఏవీ హీరోయిన్ పాత్రలు కాకపోవడంతో రాశి ఖన్నా టాలీవుడ్‌లో ఊహలు గుసగులాడే సినిమా తర్వాత బిజీగా మారింది. బ్యాక్ టు బ్యాక్ రవితేజతో బెంగాల్ టైగర్, సాయి ధరమ్ తేజ్‌తో సుప్రీమ్, ఎన్టీఆర్ జై లవకుశ, వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్‌తో మినహా మరే స్టార్ హీరోతో రాశి ఖన్నా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోలేదు. టైర్ 2 హీరోలకు జోడీగా ఎక్కువగా ఈమె నటించిన విషయం తెల్సిందే. అయినా దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే వచ్చింది.
బాలీవుడ్, కోలీవుడ్‌లో రాశి ఖన్నా బిజీ బిజీ
హీరోయిన్‌గా రాశి ఖన్నా పరిచయం అయిన కొత్తలో బొద్దుగా కనిపించేది. కానీ సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలంటే ఖచ్చితంగా సన్నగా నాజూకుగా కనిపించాలని ఫిక్స్ అయింది. అందులో భాగంగానే రాశి ఖన్నా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే బరువు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత మరింత అందంగా రాశి ఖన్నా కనిపించింది. రాశి ఖన్నా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో విజయాలు తక్కువగా ఉండటంతో మెల్ల మెల్లగా టాలీవుడ్ నుంచి దూరం అవుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి ఈమెకు ఆఫర్లు చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే లక్కీగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ మంచి విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా రాశి ఖన్నా కెరీర్ మరింత స్పీడ్ అందుకున్నట్లు అయింది.
వైట్ డ్రెస్‌లో అందాల రాశి
సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు, వీడియోలను రాశి ఖన్నా షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. రాశి అందమైన ఫోటోలు షేర్ చేసిన ప్రతిసారి వైరల్ కావడం జరుగుతుంది. మరోసారి అందాల రాశి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఏ హీరోయిన్ ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవ్వడం కామన్ విషయం. అలాంటిది రాశి ఖన్నా ఫోటోలు షేర్ చేస్తే వైరల్ కాకుండా ఉంటుందా.. అందాల రాశి ఖన్నా ఆకట్టుకునే అందంతో మరోసారి సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ రాశి ఖన్నా సొంతం అంటూ ఈ ఫోటోలకు చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ డ్రెస్ లో రాశి ఖన్నా మెరిసి పోతుందని, పేరుకు తగ్గట్లుగా ఈమె అందాల రాశి అనడంలో ఏమాత్రం డౌట్ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో ముఖ్య పాత్ర
ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా అక్కడే సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ లో చదివింది. తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆనర్స్ తో పట్టభద్రురాలు అయ్యింది. రాశి ఖన్నా చిన్న వయసులో గాయని కావాలని ఆశ పడింది. ఆ తర్వాత చదువుపై ఆసక్తి కనబర్చి ఐఏఎస్ కావాలని భావించిందట. అయితే అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగులు వేయడం, మోడలింగ్ లో వచ్చిన గుర్తింపు కారణంగా సినిమాల్లో అవకాశాలు రావడంతో చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేక పోయింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో సిద్దుకు జోడీగా తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌లో ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.