పూరి- సేతుపతి మూవీ.. బ్యాక్ డ్రాప్ ఏంటో తెలిస్తే షాకే!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పూరి-సేతుపతి (#PuriSethupathi) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పూరి-సేతుపతి (#PuriSethupathi) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఆ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎన్నో నెలల పాటు సాగిన జర్నీ ముగిసిందని, ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్, మరెన్నో హ్యాపీ మూమెంట్స్ ఎదురయ్యాయని చెప్పారు.
అంతే కాదు మేకర్స్ ఒక ఫన్నీ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో విజయ్ సేతుపతి.. పూరీ జగన్నాథ్ ను మిస్ అవుతానంటూ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమా షూటింగ్ జులై మొదటి వారంలో స్టార్ట్ అవ్వగా, కేవలం ఐదు నెలల గ్యాప్ లోనే కంప్లీట్ చేయడం విశేషం. పూరి జగన్నాథ్ తన స్టైల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా వేగంగా పూర్తి చేశారు.
పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాలో సేతుపతి మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు రాగా.. తాజా అప్డేట్ ప్రకారం ఆయన సినిమాలో బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సమాజం పట్టించుకోని ఒక బిచ్చగాడి జీవితం, అతని ఆలోచనలు, ఎమోషన్లు, ప్రేమను బేస్డ్ గా తీసుకుని కథను రాసుకున్నట్లు టాక్. సాధారణంగా హీరోలను స్టైలిష్‌గా చూపించే పూరి, ఈసారి పూర్తిగా భిన్నమైన కోణాన్ని ఎంచుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాలో సీనియర్ నటి టబు నటిస్తుండగా, ఆమె పాత్రకు ఒక సమస్యలతో నిండిన గతం ఉంటుందని సమాచారం.
బిచ్చగాడిగా జీవించే విజయ్ సేతుపతి పాత్రకు, కష్టాలతో నిండిన జీవితాన్ని గడిపిన టబు పాత్రకు సంబంధం ఏంటి? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అన్నదే కథలో మెయిన్ ఎలిమెంట్ గా ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టబు వంటి మంచి నటి ఆ పాత్రతో ఎంతలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక, సినిమాకు ఛార్మీ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బిచ్చగాడి పాత్రనే కథకు మెయిన్ ఎలిమెంట్ గా తీసుకోవడంతో ఆ టైటిల్ సెట్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్, రిలీజ్ డేట్, టీజర్ వంటి అప్డేట్స్ వరుసగా విడుదల చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే చెప్పింది. మరి టైటిల్ ఏం పెడతారో.. స్టోరీ ఏంటో తెలియాల్సి ఉంది.