దళపతిని కించపరుస్తూ ప్రకాష్ రాజ్ సెటైర్లు!
రీసెంట్‌గా మర్యాద రాముడు, పురుషోత్తముడిగా దేశం మొత్తం ఆరాధించే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సంఘాల ఆగ్రహానికి గురైన ప్రకాష్ రాజ్‌పై పలు కేసులు కూడా నమోదయ్యాయి.;
సినిమాల్లో తక్కువగా మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడిగా కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ గత కొంత కాలంగా వామపక్ష భావజాలాన్ని ఫాలో అవుతూ దేశ ప్రదాని మోదీతో పాటు బీజేపీపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా మర్యాద రాముడు, పురుషోత్తముడిగా దేశం మొత్తం ఆరాధించే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సంఘాల ఆగ్రహానికి గురైన ప్రకాష్ రాజ్‌పై పలు కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశగా మారిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరో సారి తన నోటీకి పని చెప్పారు. మరోసారి తన రాజకీయ ప్రపంగాలకు తెరలేపారు. ఆ మధ్య చెన్నై సెంట్రల్ నుంచి ఎంపీగా పోటీ చేసి చేతుల కాల్చుకున్న ప్రకాష్ రాజ్ దృష్టి ఇప్పుడు తమిళనాడు ఎన్నికలపై పడింది. దీంతో డీఎంకే కూటమిలోని సీపీఎం అభ్యర్థి ఎన్. పాండికి మద్దుతుగా ప్రచారానికి వెళ్లిన ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా విజయ్ ని కించపరుస్తూ సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది.
నటుడి కోసం విజిల్ వేయొచ్చని, రాష్ట్రాన్ని అప్పగించలేరని దళపతి విజయ్‌పై సెటైర్లు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీపై పోటీకి దిగి జోరుగా ప్రచారం చేస్తూ సామాన్యులని ఆకర్షించే మేనిఫెస్టోని విడుదల చేయడం తెలిసిందే. అధికార డీఎంకేతో పాటు ఏఐఏడీఎంకే ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నాయి. వీరికి గట్టి పోటీనిచ్చే విధంగా విజయ్ తన పార్టీ మేనిఫెస్టోని ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఇదే సందర్భంగా డీఎంకే పార్టీ కూటమికి చెందిన సీపీఎం అభ్యర్థి ఎన్ పాండికి మద్దతుగా దిండుక్కల్ జిల్లా పళని నియోజక వర్గంలో నిర్వహించిన యువజన కళా ఉత్సవంలో ప్రకాష్ రాజ్ పాల్గొని విజయ్‌పై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జరగనున్నవి ద్రావిడ మోడల్, బానిస మోడల్, సినిమా మోడల్ ఎన్నికలన్నారు. ద్రావిడ మోడల్ విద్యను అందిస్తుందని, భాసను కాపాడేదన్నారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతోందన్నారు. అయితే బానిస మోడల్ రాష్ట్ర గౌరవాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని హరించేసి మోదీ పాదాల వద్ద పెట్టిందన్నారు.
నియోజక వర్గాల పునర్విభజన బిల్లుతో తమిళనాడుకు నష్టం వాటిల్లుతుందన్నారు. బానిసత్వ మోడల్ దానికి మద్దతిస్తోందన్నారు. తిరుప్పరంకుండ్రం వ్యవహారంతో మధురైని మరో మణిపూర్‌లా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. సినిమాల్లో ఒక పాటలో వైద్యుడు, ఇంజినీర్, ముఖ్యమంత్రి ఆయిపోవచ్చని తెలిపారు. ఆ నటుడు (విజయ్) ప్రజలకు, భాషకు లేదా వారి ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు గళం విప్పారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏ మోడల్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు.