'డ్యూడ్' ఓటీటీ డేట్ ఇచ్చేశారు..!
'లవ్ టుడే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఆ సినిమాతో తమిళ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే.;
తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'డ్యూడ్' సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. 'లవ్ టుడే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఆ సినిమాతో తమిళ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమా తెలుగులోనూ థియేట్రికల్ రిలీజ్ సమయంలో, ఓటీటీలో బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా భారీ వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ ను స్టార్ హీరోల సరసన నిలిపింది. కేవలం తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు ఆడియన్స్ కూడా అభిమానించే విధంగా డ్రాగన్ సినిమా హిట్ అయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి కానుకగా వచ్చిన డ్యూడ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని, వంద కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరిన విషయం తెల్సిందే.
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా...
కోలీవుడ్, టాలీవుడ్‌లో డ్యూడ్ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే సినిమాను థియేటర్‌లలో చూసిన ప్రేక్షకులు, ఇంకా థియేటర్‌కు వెళ్లని ప్రేక్షకులు, వెళ్లలేని ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని సినిమాల మాదిరిగానే డ్యూడ్ సినిమాను సైతం నాలుగు వారాల థియేట్రికల్ స్క్రీనింగ్ పూర్తి అయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న విడుదలైంది. ఇప్పటికే దాదాపు రెండు వారాల రన్ పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల పాటు ఈ సినిమా థియేటర్ లలో ఉండబోతుంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న విషయం తెల్సిందే. డ్యూడ్ సినిమాను సైతం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
డ్యూడ్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
డ్యూడ్ సినిమాను నవంబర్ 14న స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్లాట్ ను రెడీ చేశారని, మరే సినిమాలు ఆ సమయంలో లేకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. కేవలం తమిళ్‌లో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం అలాగే హిందీలోనూ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు డ్యూడ్ సినిమాను తీసుకు వెళ్లే విధంగా ఇప్పటి నుంచే డబ్బింగ్ వర్క్ జరుగుతుందట. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయితే ఖచ్చితంగా అత్యధికంగా దేశాల్లో ఉన్న ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో కంటే ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనే సినిమాకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. అంతే కాకుండా యూత్ ఆడియన్స్ డ్యూడ్ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు నటించిన...
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంది. తెలుగులో వచ్చిన అల్లు అర్జున్ ఆర్య 2 సినిమా కథ నుంచి ఇన్సిపైర్ అయ్యి చేసినట్లుగా దర్శకుడు కీర్తీశ్వరన్ ఓపెన్‌గానే చెప్పాడు. అన్నట్లుగానే ఆర్య 2 ను పోలి ఉంది. అయినా కూడా తెలుగు ప్రేక్షకులు డ్యూడ్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ డ్యూడ్ సినిమాలో సీనియర్ నటుడు ఆర్ శరత్ కుమార్ పోషించిన పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఆయన విలక్షణమైన నటనతో సినిమా స్థాయిని పెంచాడు అనడంలో సందేహం లేదు.
థియేట్రికల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. పాజిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ సమయంలో చూసిన వారితో పోల్చితే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. డ్యూడ్ విషయంలోనూ అదే జరగబోతుంది. థియేటర్‌లో చూసిన వారు, చూడని వారు అంతా నెట్‌ఫ్లిక్స్ లో డ్యూడ్ ను చూడటం కోసం వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 14న స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.