రైటర్ అయిన నాక్కూడా ఆ డౌట్ వచ్చింది
ప్రదీప్ రంగనాథన్.. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు.;
ప్రదీప్ రంగనాథన్.. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకున్న ప్రదీప్ నుంచి మొన్న దీపావళికి డ్యూడ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. డ్యూడ్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ ను నమోదు చేసుకున్నారు ప్రదీప్.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యూడ్
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్న డ్యూడ్ ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా, డ్యూడ్ ను చూసి ఈ సినిమాపై రీసెంట్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. కొత్త సినిమాలను చూసి వాటిపై గోపాలకృష్ణ తన అభిప్రాయలను యూట్యూబ్ ద్వారా వెల్లడిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే.
డైరెక్టర్ పై పరుచూరి ప్రశంసలు
అందులో భాగంగానే ఇప్పుడు డ్యూడ్ మూవీ చూసి డైరెక్టర్ కీర్తీశ్వరన్ ను తెగ పొగిడారాయన. ఈ కథను ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో డైరెక్టర్ మొదలుపెట్టిన విధానం చాలా బావుందని, హీరోకి నచ్చిన అమ్మాయి వేరే వారిని పెళ్లి చేసుకోవడంతో కథ మొదలవడం చూసి సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని అందరూ అనుకుంటారనీ కానీ డైరెక్టర్ సినిమాకు కామెడీ టచ్ ఇచ్చారని చెప్పారు.
తర్వాత హీరోయిన్ పెళ్లికి ముందు వేరే వ్యక్తి ద్వారా ప్రెగ్నెంట్ అవగా, దాన్ని తొలగించుకోవాలనుకున్నప్పుడు హీరో వద్దని చెప్పడంతో హీరోయిన్ జన్మనిచ్చిన బిడ్డ హీరోకే పుట్టాడా అనే డౌట్ అందరికీ వస్తుందని, ఎన్నో సినిమాలకు కథలు రాసిన తనక్కూడా ఆ అనుమానం వచ్చిందని, కానీ వేరే వ్యక్తి కారణంగా హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు హీరోతో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడిన పరుచూరి, తనకు డ్యూడ్ సినిమా నచ్చిందని చెప్పారు.