స్పిరిట్.. ఇది కదా సందీప్ వంగ మాస్ అంటే..!
రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను సందీప్ వంగ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేయబోతున్నాడు.;
రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను సందీప్ వంగ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేయబోతున్నాడు. సందీప్ వంగ ప్రెజంట్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ చేసిన 3 సినిమాలే అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ అని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. ఇక యానిమల్ సినిమాతో సందీప్ వంగ మాస్ రాంపేజ్ ఏంటో చూపించాడు. యానిమల్ సినిమా రణ్ బీర్ కెరీర్ బెస్ట్ అనిపించుకోగా బాబీ డియోల్ కి ఐతే కెరీర్ లో సెకండ్ లైఫ్ ఇచ్చింది.
స్పిరిట్ మీద సూపర్ ఎక్స్ పెక్టేషన్స్..
యానిమల్ తర్వాత సందీప్ చేస్తున్న సినిమా అవ్వడంతో పాటు ప్రభాస్ తో అనేసరికి స్పిరిట్ మీద సూపర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఐతే సినిమా ప్రొడక్షన్ విషయంలో సందీప్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందీప్ తన సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో చాలా షార్ప్ గా ఉంటాడు. ఈ క్రమంలో సందీప్ వంగ స్పిరిట్ కి కావాల్సిన బిజిఎం 70 పర్సెంట్ పూర్తి చేశాడట.
ఒక్కొక్కరి డైరెక్షన్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొందరు సినిమా మొత్తం తీశాక అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తో బిజిఎం అదే ఆర్.ఆర్ చేయిస్తారు. కానీ సందీప్ వంగ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమాకు ఏ సీన్ కి ఎక్కడెక్కడ ఏయే ఆర్.ఆర్ ఉండాలన్నది ఫిక్స్ చేశాడట. సినిమాకు ఇప్పటికే సాంగ్స్, ఆర్.ఆర్ రెడీ అంటున్నాడు. ఆల్రెడీ ఏడాది నుంచి తన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ వంగ స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడు.
స్పిరిట్ 70 శాతం RR..
స్పిరిట్ షూట్ మొదలు పెట్టకముందే 70 శాతం RR అయిపోయిందట. ఇక మిగిలిన పార్ట్ కూడా షూటింగ్ టైం లో చేస్తారట. ఇలా చేయడం వల్ల షూటింగ్ తక్కువ టైం లో పూర్తి అవుతుందని అంటున్నాడు సందీప్ వంగ. యానిమల్ సినిమాకు కూడా సినిమా మొదలు పెట్టడానికి ముందే 80 శాతం ఆర్.ఆర్ పూర్తైందని చెప్పి షాక్ ఇచ్చాడు సందీప్ వంగ. ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ అనేది సందీప్ వంగాకి ఇస్తున్న పేరు. మరి ఇలాంటి ఆలోచనలు.. ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టే ఆయన్ను అలా అంటున్నారు.
ఐతే ప్రభాస్ తో షూట్ ఎప్పుడు మొదలు పెట్టాలా అని ఆసక్తిగా ఉందని అంటున్నాడు సందీప్ వంగ. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. 2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందని తెలుస్తుంది.