ప్రభాస్ 'ఫౌజీ'.. నేచురాలిటీపై ఫుల్ ఫోకస్ పెట్టారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతున్నా.. ఫౌజీ మాత్రం అందుకు భిన్నంగా చర్చనీయాంశమవుతోంది.

Update: 2026-07-13 22:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతున్నా.. ఫౌజీ మాత్రం అందుకు భిన్నంగా చర్చనీయాంశమవుతోంది. భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే.. కథ జరిగే కాలాన్ని, ఆ ఎన్విరాన్మెంట్ ను న్యాచురల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే చిత్రబృందం ఎక్కువ ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు హను రాఘవపూడి తన సినిమాల్లో ఎమోషన్స్ కు, నేచురాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే పేరు ఉంది. అదే శైలిని ఫౌజీలో కూడా కొనసాగించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 1930ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ ను స్క్రీన్ పై రియల్ ఎక్స్పీరియన్స్ తో చూపించేందుకు ప్రత్యేకంగా భారీ సెట్లు నిర్మిస్తున్నారని సమాచారం. ఆ కాలంలో కనిపించే భవనాలు, వీధులు, విలేజ్ ఎన్విరాన్మెంట్, సైనిక శిబిరాలు, డ్రెస్సింగ్ వంటి ప్రతి అంశాన్ని నీట్ గా డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమాలో నేచురాలిటీ కనిపించాలంటే కేవలం సెట్లు మాత్రమే కాకుండా.. లైటింగ్, లొకేషన్లు, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు కూడా కీలకం. అందుకే ప్రతి ఫ్రేమ్ సహజంగా కనిపించేలా మూవీ టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలుస్తోంది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపూ అది ఒక సినిమా అనే ఫీలింగ్ కాకుండా.. ఆ కాలంలోకి వెళ్లిపోయిన ఎక్స్పీరియన్స్ కలిగించేలా షూటింగ్ సాగుతోందని ప్రచారం జరుగుతోంది.

దేశభక్తి, యుద్ధ నేపథ్యం, భావోద్వేగాలతో కూడిన ఫౌజీ కథలో విజువల్ గ్రాండియర్‌ తో పాటు రియాలిటీ కూడా సమానంగా ఉండాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రాఫిక్స్‌ పై పూర్తిగా ఆధారపడకుండా.. సాధ్యమైనంత వరకు రియల్ లొకేషన్స్, నేచురల్ షూటింగ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకురావచ్చని చెప్పాలి.

ఇక షూటింగ్ కొనసాగుతున్న దశలోనే సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది. డిజిటల్, థియేట్రికల్ హక్కులకు సంబంధించి భారీ స్థాయిలో డీల్స్ జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రభాస్ ఇప్పటివరకు చేసిన చిత్రాలతో పోలిస్తే ఫౌజీ భిన్నమైన జానర్‌ లో రూపొందుతుండటం ఇంట్రెస్ట్ పెంచుతోంది. భారీ యాక్షన్‌ తో పాటు భావోద్వేగాలు, ప్రేమ, దేశభక్తి అంశాలు ఈక్వల్ గా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా ప్రభాస్ కెరీర్‌ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్ ఫౌజీ చిత్రంతోbహీరోయిన్ గా పరిచయం కానుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, నేచురాలిటీకి పెద్దపీట వేస్తూ ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారనే ప్రచారం ఫౌజీపై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రేక్షకులకు నేచురల్ పీరియాడిక్ వరల్డ్ చూపించడమే మూవీ టీమ్ టార్గెట్ గా తెలుస్తోంది.

Tags:    

Similar News