నీ ఒళ్లు బంగారం కాను.. జూ.అతిలోక సుందరి స్టన్నింగ్ లుక్!
స్నేహితురాలు ఆకాంక్ష రాంజన్ కపూర్ సంగీత్ వేడుకలో ఇలా తళుక్కున మెరిసింది ఈ నటవారసురాలు. ఈ సరికొత్త అవుట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్ ఇచ్చిన పోజులు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి.
బంగారు వర్ణం ధగధగలతో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. జాన్వీ ఇప్పటివరకూ ఎన్నో రూపాలలో కనిపించింది కానీ.. ఇది మాత్రం నిజంగా ఎక్స్ క్లూజివ్. స్నేహితురాలు ఆకాంక్ష రాంజన్ కపూర్ సంగీత్ వేడుకలో ఇలా తళుక్కున మెరిసింది ఈ నటవారసురాలు. ఈ సరికొత్త అవుట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్ ఇచ్చిన పోజులు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి.
బంగారు వర్ణం మెటాలిక్ బ్లౌజ్.. మ్యాచింగ్ స్కర్ట్ లో అదిరిపోయింది జాన్వీ. ఇక తన మేకప్, ధరించిన ఆభరణాలు కూడా అంతే స్పెషల్ గా ఆకర్షిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడుతూనే.. అల్ట్రా స్టైలిష్ మోడ్రన్ లుక్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాషన్ ప్రియులు సైతం ఈ వినూత్న డిజైన్ మేకింగ్‌ను ఎంతగానో అభినందిస్తున్నారు.
నిజానికి ఇదే పెళ్లి వేడుకలో ఆలియా భట్ అదిరిపోయే చీర కట్టుతో కాంపిటీషన్ లో ఉంది. అయినా జాన్వీ కపూర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అయితే ఈ పెళ్లి వేడుకలో తోడి పెళ్లి కూతురు ఎవరో కనిపెట్టండి అంటూ సరదాగా ఒక ఆట కూడా ఆడుకున్నారు గాళ్స్ గ్యాంగ్. బాలీవుడ్ సెలబ్రిటీల సందడితో ఈ సంగీత్ - వివాహ వేడుకలు ఎంతో వైభవంగా సాగాయి.
జాన్వీకపూర్ దేవర, పెద్ది చిత్రాలతో విజయాలు అందుకుని తదుపరి దక్షిణాది కమిట్ మెంట్ గురించి వేచి చూస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ లోను కొన్ని కమిట్ మెంట్లను పూర్తి చేయాల్సి ఉంది. తెలుగులో బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్‌లు అందుకోవడంతో టాలీవుడ్‌లో జాన్వీ క్రేజ్ మునుపెన్నడూ లేనంతగా పెరిగింది.
అలాగే ఈ ఏడాదిలోనే తమిళంలోను ఎంట్రీ ఇవ్వబోతోందని గుసగుస వినిపిస్తోంది. జాన్వీ ఉత్తరాది- దక్షిణాది రెండు చోట్లా తెలివైన గేమ్ ఆడుతోంది. ఏడాది ద్వితీయార్థంలో జాన్వీ కపూర్ నటించే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది? అనేది ఇంకా తేలాల్సి ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో జాన్వీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కథలను వింటోంది.