ఫాజీ త్వరగా తెచ్చే ప్లాన్.. నిజమేనా..?
ఐతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫాజీతో రాబోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే సినిమా ఆడియన్స్ కి అందించారు. ఐతే రాజా సాబ్ తో రెబల్ ఫ్యాన్స్ అంత సాటిస్ఫై అవ్వలేదు అన్నది వాస్తవం. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్, ఫాంటసీ అంటూ నానా హంగామా చేశారు ఐతే సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. మేకర్స్ మాత్రం పండగ సీజన్ కాబట్టి సినిమా ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.
బిఫోర్ ఇండిపెండెన్స్ వార్ విత్ లవ్ స్టోరీ..
ఐతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫాజీతో రాబోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ వార్ విత్ లవ్ స్టోరీ కథతో ఈ సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ చివరి వరకు తీసుకు రావాలనే ప్లానింగ్ ఉండగా రాజా సాబ్ రిజల్ట్ చూశాక సినిమా రిలీజ్ ముందుకు తెచ్చే ఆలోచన ఉందట.
ఫౌజీ తర్వాత తెస్తే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. సీతారామం తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇది. అంతేకాదు ఈ సినిమా పోస్టర్ తోనే హైప్ ఎక్కించారు. ఇన్నాళ్లు ప్రభాస్ సీరియస్ రోల్స్ చేస్తున్నాడు ఒక సరదా సినిమా మళ్లీ బుజ్జిగాడు టైప్ ప్రభాస్ ని చూడాలని అనుకున్నారు. ఐతే అలాంటి క్యారెక్టరైజేషన్ తో కాస్త థ్రిల్లర్ జోడించాలని చేసిన ప్రయత్నమే రాజా సాబ్.
ఫౌజీ తో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమా..
ఐతే మాకు బాహుబలి ప్రభాస్ మాత్రమే కావాలి ఆయన సీరియస్ గా యాక్షన్ సినిమాలే చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సో ఫౌజీ ఎలాగు అలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు. ఫౌజీ తో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాను 2027 రిలీజ్ ప్లానింగ్ ఉంది.
ప్రభాస్ సినిమాల్లో లిస్ట్ లో సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా కొత్త సినిమా లాక్ చేయాలంటే ఎలా లేదన్నా మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. అందుకే ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఒకటి అనుకున్నా అది ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది.
ఐతే రాబోతున్న ఈ సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ కచ్చితంగా పండగ చేసుకునే ఛాన్స్ ఉంది. ఐతే ఈ ఇయర్ మాత్రం ఫౌజీ తో ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వాలని చూస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది.