2026 లో టాలీవుడ్ కి ఆ ఛాన్స్ లేనట్లేనా?
ప్రభాస్ స్టార్‌డమ్ .. హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చిత్రాన్ని ఖచ్చితంగా భారీ వసూళ్ల దిశగా తీసుకెళ్తాయని అంచనా.
టాలీవుడ్ లో 1000 కోట్ల మార్కు అనేది బెంచ్‌మార్క్‌గా మారింది. ఈ అద్భుతమైన ఫీట్‌ను పరిచయం చేసిన టాలీవుడ్ కొంతకాలంగా ఆ స్థాయి వసూళ్లను సాధించే భారీ చిత్రాల కోసమే చూస్తోంది. గత ఏడాది స్టార్ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ప్రభావాన్ని చూపకపోవడంతో వెయ్యి కోట్ల కల నెరవేరలేదు. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ అప్‌కమింగ్ చిత్రాల జాబితాను పరిశీలిస్తే 1000 కోట్ల క్లబ్‌లో చేరే సత్తా ఉన్న చిత్రం `ఫౌజీ` మాత్రమే కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాపైనే పరిశ్రమ ఆశలు ఉన్నాయి.
ప్రభాస్ స్టార్‌డమ్ .. హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చిత్రాన్ని ఖచ్చితంగా భారీ వసూళ్ల దిశగా తీసుకెళ్తాయని అంచనా. అయితే ఈ సినిమా 2026లోనే విడుదలవుతుందా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభాస్ ప్రస్తుతం `స్పిరిట్` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం.. కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ `ఫౌజీ` సెట్స్‌లోకి అడుగుపెట్టాల్సి ఉండటంతో టైమ్‌లైన్ గందరగోళంగా ఉంది. డిసెంబర్ నాటికి సినిమాను సిద్ధం చేసేందుకు టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా? పౌజీ షూటింగ్ కంప్లీట్ అయ్యే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవేళ ఫౌజీ గనుక ఈ ఏడాది థియేటర్లలోకి వస్తే అది కేవలం 500 కోట్ల క్లబ్‌తో ఆగిపోయే చిత్రం కాదు. భారీ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు అందించే కంటెంట్ , విజువల్స్ పరంగా 1000 కోట్ల మార్కును అందుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సినిమా రిలీజ్ డేట్ , ప్రమోషన్స్ గనుక పక్కాగా ప్లాన్ చేస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ రికార్డుల మోత మోగించడం ఖాయం. పక్కనే ఉన్న బాలీవుడ్ ... శాండల్వుడ్ ఇండస్ట్రీలు మాత్రం ఈ ఏడాది భారీ వసూళ్లకు సిద్ధమవుతున్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలోని `రామాయణ` , కన్నడలో యష్ హీరోగా రాబోతున్న `టాక్సిక్` చిత్రాలు 1000 కోట్ల మార్కును సునాయాసంగా దాటే అవకాశం కనిపిస్తోంది.
టాలీవుడ్ మిస్ అయిన అవకాశాన్ని ఈ సినిమాలు అందిపుచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్‌కు 1000 కోట్ల క్లబ్‌లో చోటు దక్కుతుందా ?లేదా ? అనేది పూర్తిగా `ఫౌజీ` సినిమా విడుదలపైనే ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు థియేటర్లలో భారీ అనుభవాన్ని ఇచ్చే కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ తగ్గలేదని ఇటీవల `మా ఇంటి బంగారం`, `లెనిన్` సినిమాలు నిరూపించాయి. తాజాగా అదే స్థాయిలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం పడితే టాలీవుడ్ కూడా ఈ ఏడాది ఆ ఘనతను సొంతం చేసుకోవచ్చు. మరే ంజరుగుతుందన్నది చూడాలి.