పవన్‌ పవర్‌ డాన్స్ చూడబోతున్నారట..!

ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కమిట్‌ అయిన సినిమాలను ముగించే పనిలో ఉన్నాడు.;

Update: 2025-09-06 10:32 GMT

ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కమిట్‌ అయిన సినిమాలను ముగించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఎఎం రత్నంకి ఇచ్చిన మాట ప్రకారం హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేయడం జరిగింది. ఆ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా డీసెంట్‌ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. వీరమల్లు సినిమా తర్వాత వెంటనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్‌ రెడీ అవుతున్నాడు. సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లుతో పోయినది ఓజీతో రావడం ఖాయం అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణ్ అభిమానులు చాలా ధీమాతో కనిపిస్తున్నారు.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి దేవిశ్రీ ప్రసాద్‌

ఓజీ సినిమా ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. దాంతో అనుకున్న తేదీకి ఓజీ వచ్చి తీరుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తో హరీష్ శంకర్‌ గతంలో చేసిన గబ్బర్‌ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరిది హిట్‌ కాంబో కావడంతో ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పై అంచనాలు కలిగి ఉన్నారు. పవన్‌ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ కారణంగా సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్స్ వేసినట్లు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్ సింగ్‌ కి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ డాన్స్ మూమెంట్స్‌

ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా సినీ అవార్డ్‌ వేడుకల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పాల్గొన్నాడు. ఆయన రెడ్‌ కార్పెట్‌ పై మాట్లాడిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా కోసం తాను ఇప్పటికే సాంగ్స్ రికార్డ్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక పాట చిత్రీకరణ కూడా చేశారు. ఆ పాట విన్న తర్వాత పవన్‌ కళ్యాణ్ సర్‌ హ్యాండ్‌ షేక్ ఇచ్చి చాలా రోజుల తర్వాత డాన్స్ చేయాలి అనిపించింది అన్నారట. ఆయన మాటలను బట్టి చూస్తే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో పవన్‌ కళ్యాణ్ పవర్ డాన్స్ చూసే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కి డాన్స్ చేసే మూడ్‌ను తెప్పించే విధంగా దేవి శ్రీ తన పాటను ట్యూన్‌ చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఎదురుచూపులు మరింత ఎక్కువ అవుతున్నాయి.

ఉస్తాద్‌ భగత్ సింగ్‌ పాటలు..

దేవి శ్రీ ప్రసాద్‌ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్‌ సూపర్ హిట్‌లు అందుకుంటున్నారు. అందుకే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకి కూడా మంచి మ్యూజికల్‌ ఆల్బంను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. పవన్‌ మూవీ మ్యూజికల్‌గా హిట్‌ అయితే వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కి ఇప్పటికే బజ్‌ విపరీతంగా ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్‌ డాన్స్ చేసే స్థాయిలో దేవి ట్యూన్‌ చేశాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని, అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అంతా కోరుతున్నారు. కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అతి త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News