పవన్ కళ్యాణ్ OG.. అప్పుడే అన్ని కోట్లా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ.;

Update: 2025-09-21 08:24 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఓజీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో చాలా చోట్ల టికెట్స్ సోల్డ్ అయిపోయాయి. టికెట్లు పెట్టడమే లేటు.. సినీ ప్రియులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. టికెట్లు దొరికిన వాళ్లు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఓజీ మూవీకి ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ బట్టి అలా జరుగుతుందనే అంతా ఇప్పటికే ఎక్పెక్ట్ చేశారు. అనుకున్నట్లే ఇప్పుడు ప్రీ సేల్స్ విషయంలో ఓజీ మూవీ దూసుకుపోతోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా సందడి చేస్తోంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్స్ లో ఓజీ మూవీ రూ.30 కోట్లకు పైగా సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఆ నెంబర్ భారీగా పెరుగుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో సినిమా భారీ ఓపెనింగ్స్ నమోదు చేసి.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

అదే సమయంలో ఓవర్సీస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో ఇప్పటివరకు ఓజీ 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద ఓపెనర్ గా నిలివనుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. 3 మిలియన్ డాలర్స్ మార్క్ ను ఓజీ టచ్ చేసే అవకాశం ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ గా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. మ్యూజిక్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

పవర్ ఫుల్ రోల్ లో పవన్ కనిపించనుండగా.. ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా సందడి చేయనున్నారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, సిరి లెళ్ల (నారా రోహిత్ కు కాబోయే భార్య) శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News