ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం!
ఎవరికైనా అభిమాన నటీనటులుంటారు. అది సాధారణ ఆడియన్స్ కు అయినా, సినీ సెలబ్రిటీలకు అయినా.;
ఎవరికైనా అభిమాన నటీనటులుంటారు. అది సాధారణ ఆడియన్స్ కు అయినా, సినీ సెలబ్రిటీలకు అయినా. అయితే సెలబ్రిటీలకు ఏ హీరోలు ఇష్టం, ఏ హీరోయిన్లు ఇష్టం, వారికి ఎలాంటి సినిమాలు చేయాలనుంది.. ఇలా వారి అభిరుచులను తెలుసుకోవడానికి అందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే వారు కూడా ఫ్యాన్స్ కోసం తమ అభిరుచులను సందర్భమొచ్చినప్పుడల్లా బయటపెడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ హీరోయిన్ అంటే ఇష్టమో తెలుసుకోవాలని ఎంతో ఎగ్జైట్ అవుతుండగా రీసెంట్ గా హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్, క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కు సాధారణ అభిమానులే కాదు, సెలబ్రిటీల్లో కూడా ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
పవన్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనే!
మరి.. కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కు ఫేవరేట్ హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పుడు బయటపడింది. వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పవన్ కు ఈ ప్రశ్న ఎదురైంది. ఆలియా భట్, దీపికా పదుకొణె, కృతి సనన్, కియారా అద్వానీలో ఎవరి యాక్టింగ్ ఇష్టమని అడగ్గా పవన్ వెంటనే కృతి సనన్ పేరు చెప్పారు.
ఆమె యాక్టింగ్ కూడా నచ్చుతుంది
ఇందిరా గాంధీ క్యారెక్టర్ లో కనిపించిన కంగనా యాక్టింగ్ అంటే కూడా నచ్చుతుందని తెలిపారు. అయితే ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్ మాత్రం శ్రీదేవి అని, వెల్లడించారు పవన్ కళ్యాణ్. అలనాటి నటి సావిత్రి అంటే ఎంతో ఇష్టమని చెప్పిన పవన్, ఆమె సినిమాలతో పాటూ ఆమె వ్యక్తిత్వమన్నా ఇష్టమని తెలిపారు. ఇక వీరమల్లు విషయానికొస్తే గత వారం రిలీజైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది.