సాధారణ ప్రేక్షకుల కోసం OG రేట్లు డౌన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ OG ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ OG ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ప్రీమియర్స్ హంగామా, రికార్డు వసూళ్లు, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌తో హీట్ కొనసాగుతోంది. సినిమా టాక్ మిక్స్‌గా ఉన్నప్పటికీ, పవన్ స్టైల్‌కి కనెక్ట్ అయిన అభిమానులు హౌస్‌ఫుల్ షోలు చేస్తూ థియేటర్లను హోరెత్తిస్తున్నారు.
ఈ హైప్ మధ్యే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదటి రెండు రోజులు భారీ రేట్లతో బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ జరిగినా, ఇకపై సాధారణ ప్రేక్షకుల కోసం టికెట్ ధరలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోని సి సెంటర్లలో టికెట్ ధరలు తగ్గించబడుతున్నాయి.
మూవీ బజ్ ప్రకారం, ఇకపై కామన్ మాన్ కూడా సులభంగా చూడగలిగేలా రేట్లను ఫిక్స్ చేశారు. భట్టిప్రోలు పార్వతి టాకీస్‌లో ఇప్పటికే నాలుగు షోలు 200, 150 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి. ఇది మిగతా సెంటర్లకూ రిఫ్లెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అంటే, టికెట్ రేట్ల సమస్య వల్ల ఆగిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ తిరిగి హాళ్ల వైపు రావడానికి ఇది మంచి బూస్ట్ అవుతుంది.
గతంలో పవన్ సినిమాలు కూడా మొదటి హైప్ తర్వాత అందుబాటు రేట్లతో మాస్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. అత్తారింటికి దారేది టైమ్‌లో కూడా ఇలాంటి స్ట్రాటజీని పాటించడంతో లాంగ్ రన్‌లో సినిమాలు భారీ లాభాలు సాధించాయి. ఇప్పుడు ఓజీకి కూడా అదే స్ట్రాటజీని అనుసరించడం వల్ల లాంగ్ టర్మ్ వసూళ్లపై పాజిటివ్ ప్రభావం చూపనుంది.
ఇకపై దసరా హాలిడే సీజన్ రాబోతుండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇలాంటి అందుబాటు రేట్లు కీలకం కానున్నాయి. వీకెండ్ హాలిడేల వల్ల కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద, ఓజీ భారీ రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ఇప్పుడు అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. టికెట్ రేట్లు తగ్గడంతో సినిమా మరింతగా బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. ఇక సాహో, OG యూనివర్స్ కూడా కుదిరితే జరగవచ్చని అన్నారు దర్శకుడు. కానీ అన్ని అనుకూలిస్తేనే అది సాధ్యం అవుతుందని మరో వివరణ ఇచ్చారు. మరి భవిష్యత్తులో ఆ కలయికలో ఓ సినిమా వస్తుందో లేదో చూడాలి.