తారక్, నీల్.. ఇది అసలు మ్యాటర్
క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడిందని, ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మధ్య సినిమా కథ, సన్నివేశాల విషయంలో కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను మేకర్స్ షూట్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్.
అయితే కొద్ది రోజుల నుంచి తారక్- నీల్ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడిందని, ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మధ్య సినిమా కథ, సన్నివేశాల విషయంలో కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
కానీ దీనిపై ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఆ ఊహాగానాలు ఉత్తుత్తివేవని తెలుస్తోంది. ఎన్టీఆర్ గాయం వల్ల చిన్న బ్రేక్ తీసుకున్నారని సమాచారం. అయినా ప్రశాంత్ నీల్.. ఒక షెడ్యూల్ ను నిర్వహించాక కాస్త బ్రేక్ తీసుకుంటారు. అవుట్ పుట్ ను మొత్తం పరిశీలించాక నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.
అలా తన వర్క్ స్ట్రాటజీలో భాగంగానే షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారని.. ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ రాలేదని సమాచారం. అయితే ఇప్పుడు నవంబర్ మూడో వారంలో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని.. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని వినికిడి.
కొత్త షెడ్యూల్ యూరప్ లో జరగనుందని సమాచారం. ఆ షెడ్యూల్ లో తారక్ పై కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించనున్నాయని వినికిడి. అందుకే యూరప్ లో సరైన ప్లేస్ ను ఇప్పటికే పరిశీలించి మెయిన్ లొకేషన్ గా ఫిక్స్ చేశారని సమాచారం.
ఏదేమైనా తాత్కాలికంగా సినిమా ఆగిందన్న విషయం.. రూమరేనని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. అయితే సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో మూవీ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. మరి చూడాలి ఏం జరుగుతుందో.