నాని ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో ఎందుకు పెట్టాడు..?

ప్యారడైజ్ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు నాని ఫ్యాన్స్. అంతేకాదు హీరోయిన్ తో పాటు మిగతా డీటైల్స్ కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు.;

Update: 2025-11-23 06:30 GMT

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సీక్రెట్ మిషన్ కొనసాగుతూనే ఉంది. సినిమా అనౌన్స్ మెంట్ స్టేట్మెంట్ అంటూ ఒక రేంజ్ హైప్ ఎక్కించిన నాని అండ్ శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత జడల్ రోల్ ని పరిచయం చేస్తూ మరో గ్లింప్స్ వదిలారు. ఇక ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. సినిమా నుంచి రీసెంట్ గా ఒక బీటీఎస్ వీడియో లాంటిది పెట్టారు. ఐతే మార్చి లో రిలీజ్ కాబోతున్న నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు.

ఈ సినిమాకు మరింత ఎక్కువ కేర్..

అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. గ్లింప్స్ లు రెండు వదిలి ఇంట్రెస్ట్ పెంచాడు కానీ ఫ్యాన్స్ ని ఈ వెయిటింగ్ లో పెట్టడం వెనక రీజన్ ఏంటన్నది అర్థం కావట్లేదు. నాని తన ప్రతి సినిమా విషయంలో తీసుకునే కేర్ కన్నా ఈ సినిమాకు మరింత ఎక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే వెయిటింగ్ కి తగిన డబుల్ ట్రీట్ ఇచ్చేందుకే నాని ఇలా చేస్తున్నాడని అంటున్నారు.

ప్యారడైజ్ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు నాని ఫ్యాన్స్. అంతేకాదు హీరోయిన్ తో పాటు మిగతా డీటైల్స్ కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఐతే ఈ క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలన్నది నాని ఇంకా డెసిషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లోనే బిజీ బిజీగా ఉన్నాడు నాని. షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసి అప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తుంది.

చరణ్ తో ఫైట్ కి సిద్ధం..

నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. ఐతే అదే టైం కు చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చరణ్ తో ఫైట్ కి సిద్ధం అంటున్నాడు నాని. ఐతే చరణ్ సినిమా ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెడితే ది ప్యారడైజ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. నాని అండ్ టీం మరి ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ అప్డేట్స్ కోసం వాళ్ల ఎగ్జైట్మెంట్ ని అర్ధం చేసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

2026 లో నాని ది ప్యారడైజ్ ఒక్కటే కాదు సుజీత్ డైరెక్షన్ లో కూడా సినిమా లైన్లో పెట్టాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందట. ఓజీ తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా కాబట్టి నాని సినిమాపై ఆటోమెటిక్ గా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

Tags:    

Similar News