ఆ డైరెక్టర్ తో ఎవరూ ఊహించని జానర్లో నాని సినిమా
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయారు.;
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి కొత్త టాలెంట్ కు అవకాశాలిస్తూ వస్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయిన నాని ఆఖరిగా హిట్3 తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్3 తర్వాత నాని పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.
ది ప్యారడైజ్ కోసం తెగ కష్టపడుతున్న నాని
కాగా నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని చాలా కష్టపడుతున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ది ప్యారడైజ్ పై అందరికీ భారీ అంచనాలుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుజిత్ తో భారీ బడ్జెట్ మూవీ
ది ప్యారడైజ్ షూటింగ్ ను వచ్చే ఏడాది మొదట్లోనే పూర్తి చేయనున్న నాని ఆ తర్వాత సుజిత్ తో కలిసి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా అనౌన్స్ కూడా అయింది. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రానున్న ఆ సినిమా నాని కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. 2026లో నాని- సుజిత్ సినిమా రిలీజ్ కానుంది.
హాయ్ నాన్న డైరెక్టర్ కు మరో ఛాన్స్
ఆ రెండింటి తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ తో కలిసి మరో సినిమా చేయడానికి నాని కమిట్ అయ్యారు. ఓ పీరియాడిక్ డ్రామా కథ చెప్పి శౌర్యువ్ ఇప్పటికే నానిని ఇంప్రెస్ చేయగా, నాని ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ తో, భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. సినిమా చూశాక ఈ సినిమా హాయ్ నాన్న డైరెక్టర్ తీసిందా అనేలా దీన్ని శౌర్యువ్ దీన్ని ప్లాన్ చేశారని, 2026 సంక్రాంతికి ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. సుజిత్ సినిమా పూర్తి చేశాక నాని, శౌర్యువ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇవి కాకుండా జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞానవేల్ తో కూడా నాని ఓ సినిమాను చేయడానికి చర్చలు జరుపతున్నట్టు తెలుస్తోంది.