తొలి అవకాశం ఇచ్చినందుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ కృతజ్ఞత
ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలో నటి - నిర్మాత కృష్ణవేణికి సంతాప ప్రకటనను ప్రచురించింది. కృష్ణవేణి 102 సంవత్సరాల వయసులో మరణించారు.;
తమకో అవకాశం కల్పించి ఉపాధినిచ్చిన వారిని మర్చిపోవడం ఎప్పుడూ క్షంతవ్యం కాదు. చాలామంది కాలగమనంలో మర్చిపోవచ్చు. కొందరు గుర్తు చేసుకుని వారిని తగు రీతిలో సత్కరించడం లేదా, వారి రుణం తీర్చుకునేందుకు ప్రయత్నించడం చూస్తాం. అలాంటి ఒక ప్రయత్నమిది.
ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలో నటి - నిర్మాత కృష్ణవేణికి సంతాప ప్రకటనను ప్రచురించింది. కృష్ణవేణి 102 సంవత్సరాల వయసులో మరణించారు. నేడు ఆమె పదకొండవ రోజు వేడుక. ఈ సందర్భంగా నందమూరి కుటుంబం తమ కృతజ్ఞతను ప్రదర్శించింది. దివంగత ఎన్టీ రామారావు కుమారులు, కుమార్తెలు పత్రికలో ఈ ప్రకటన ఇచ్చారు. కృష్ణవేణి కుటుంబీకులు ఎవరూ ఈ ప్రకటనను ఇవ్వలేదు.
లెజెండరీ ఎన్టీఆర్‌ను తన మొదటి చిత్రం `మన దేశం`(1949)తో పరిచయం చేసారు కృష్ణవేణి. ఆ తర్వాత తారక రాముడి అజేయమైన కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఇక తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే నందమూరి ఫ్యామిలీ విధిగా ఈ ప్రకటనతో కృతజ్ఞత చూపించారు. ఈరోజుల్లో పోయిన వాళ్లను గుర్తించుకునేది ఎందరు. కానీ నందమూరి కుటుంబం అందుకు భిన్నంగా తమ మూల వృక్షానికి అవకాశం కల్పించిన నిర్మాతను గౌరవించారు. తమ ప్రేమను కనబరిచారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు తమ కృతజ్ఞతను చూపించడం నిజంగా ప్రశంసనీయం. కృష్ణవేణి పదకొండవ రోజు వేడుకను ఫిల్మ్‌నగర్‌లోని ఎఫ్.ఎన్.సిసిలో నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా దీనికి హాజరవుతున్నారు.