రెడ్ మిర్చీ రేంజ్ లో సెగలు పుట్టిస్తున్న మృణాల్.. ఆ స్పెషల్ మూమెంట్స్ షేర్ చేస్తూ!
పేరుకే బాలీవుడ్ బ్యూటీ అయినా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సొగసరి మృణాల్ ఠాకూర్.
పేరుకే బాలీవుడ్ బ్యూటీ అయినా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సొగసరి మృణాల్ ఠాకూర్. అందం అభినయంతో చూడచక్కని చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంటుంది. చిన్నతనం నుండే నటన రంగంలో రాణించాలని ఎన్నో కలలు కన్న ఈమె.. తొలిసారి 2012లో ముజ్సే కుచ్ కెహెతి ఏ ఖామోషియన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. బుల్లితెరపై తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. ఆ తర్వాత 2014లో తొలిసారి విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది.
మరాఠీ చిత్రంతో హిందీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. అలా రెండు మరాఠీ చిత్రాల తర్వాత 2018లో లవ్ సోనియా అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మృణాల్ సూపర్ థర్టీ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది. తర్వాత హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఠాకూర్ తొలిసారి సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి మొదటి సినిమాతోనే కుర్ర కారు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన తొలి సినిమా.
మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్ కలయికలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సీతా మహాలక్ష్మి పాత్రలో కట్టుబొట్టు సాంప్రదాయంగా కనిపించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ , స్వప్న దత్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా కీలకపాత్ర పోషించింది.
మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న మృణాల్ ఆ తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ ఏడాది డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది.
జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే, వరుణ్ ధావన్ కీలక పాత్రలు పోషించారు . డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే మృణాల్ కూడా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో తాము గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
రెడ్ డ్రెస్సులో రెడ్ మిర్చీలా సెగలు పుట్టిస్తూ గ్లామర్ వలకబోసింది ఈ ముద్దుగుమ్మ.. అలాగే సినిమా ప్రమోషన్స్ లో తీసుకున్న ఫోటోలు, మేకోవర్ ఫోటోలు, అలాగే తనకి ఇష్టమైన ఫుడ్ వివరాలు ఇలా ప్రతిదీ కూడా అభిమానులతో పంచుకుంది. మొత్తానికి అయితే జూన్ నెల ప్రారంభం కావడంతో మే నెలకు సంబంధించిన ప్రతి మూమెంట్ ని ఇలా అభిమానులతో షేర్ చేసింది.