మోక్షు ఎంట్రీ ఈసారైనా స‌క్సెస్ అవుతుందా?

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్‌కు దారి తీస్తోంది

Update: 2026-09-06 23:30 GMT

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్‌కు దారి తీస్తోంది. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడనే ప్రచారం కొత్తది కాదు. గత కొన్నేళ్లుగా ఆయన సినీ రంగ ప్రవేశంపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ప్రతిసారి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మోక్షజ్ఞ తొలి సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈసారి మాత్రం నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి.

అయితే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌డం లేదు. సాధారణంగా స్టార్ కిడ్స్ విషయంలో త్వరగా లాంచ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మోక్షజ్ఞ విషయంలో మాత్రం హడావుడి కంటే సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూసినట్లు కనిపిస్తోంది. హీరోకు సరిపోయే కథ, డైరెక్ట‌ర్, నిర్మాత‌లు అన్నీ కుదిరిన తర్వాతే ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావాలనే వ్యూహం వెనుక ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొద‌టి సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా ఆ సినిమా ముందుకు సాగలేదు. దీంతో మోక్షజ్ఞ డెబ్యూకు మరోసారి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త కాంబినేషన్‌తో మరో ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ అయినా పక్కా ప్రణాళికతో షూటింగ్ ప్రారంభించి రిలీజ్ వరకు స‌క్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తుందా అన్న ప్రశ్న కూడా ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మోక్షజ్ఞపై ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. బాలకృష్ణ వంటి మాస్ స్టార్ కొడుకుగా మాత్రమే కాదు, నందమూరి కుటుంబ వారసత్వంలో ఈ జెన‌రేష‌న్ హీరోగా మోక్షు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జూ. ఎన్టీఆర్ ఇప్పటికే నెక్ట్స్ లెవెల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, మోక్షజ్ఞకు ఫ్యామిలీ నేమ్ ఒక అడ్వాంటేజ్ అయినప్పటికీ అదే సమయంలో భారీ ఒత్తిడిగా కూడా మారే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే మోక్ష‌జ్ఞ‌కు మొద‌టి సినిమా నుంచే ఆడియ‌న్స్ పోలిక‌లు పెట్ట‌డం చేస్తుంటారు.

అందుకే మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ, విజువల్ స్కేల్ ఉన్న సినిమాలను తెరకెక్కించిన వశిష్ఠ వంటి డైరెక్ట‌ర్ తో లాంచ్ చేయాలనే ప్రయత్నాన్ని సాధారణ డెబ్యూగా చూడలేం. ఇది సేఫ్ గేమ్ కంటే భారీ స్థాయిలో మోక్షజ్ఞను పరిచయం చేయాలనే ప్లాన్‌గా కనిపిస్తోంది. అయితే భారీ బ్యానర్, స్టార్ డైరెక్ట‌ర్ మాత్రమే స‌క్సెస్ ను డిసైడ్ చేయ‌రు. సరైన కథ, మోక్షజ్ఞకు సరిపోయే క్యారెక్ట‌ర్, ఆడియ‌న్స్ తో ఏర్ప‌డే కనెక్షన్ అన్నీ కీలక‌మే. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపుల‌కు ఈసారి నిజమైన ముగింపు దొరుకుతుందా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News