1000 కోట్ల వ‌సూళ్ల సినిమాపై చేతులెత్తేసిన మ‌ణిర‌త్నం!

టాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 1000 కోట్ల సినిమా అన్న‌దే ఎప్పుడో న‌మోదైంది.;

Update: 2025-05-25 11:00 GMT

టాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 1000 కోట్ల సినిమా అన్న‌దే ఎప్పుడో న‌మోదైంది. వెయ్యి కోట్ల వ‌సూళ్ల లెక్క అన్న‌ది టాలీవుడ్ కి ఇప్పుడు పెద్ద విష‌యం కాదు. ఇప్పుడు టాలీవుడ్ టార్గెట్ 2000 కోట్లు. ఎందుకంటే టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్ ఈ రికార్డును సృష్టించింది `దంగల్` తో . ఇప్పుడా రికార్డును బ్రేక్ చేసి టాలీవుడ్ పేరిట స‌రికొత్త రికార్డు నమోద‌వ్వాలి. అదే టాలీవుడ్ ముందున్న బిగ్ టార్గెట్ అయితే కోలీవుడ్ కి మాత్రం 1000 కోట్ల సినిమా అన్న‌ది ఇంకా ఆంద‌ని ద్రాక్ష‌గానే ఉంది.

ర‌క ర‌కాల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ 1000 కోట్లు ఏ సినిమా సాధించ‌లేదు. 600-700కోట్ల వ‌సూళ్ల మ‌ధ్య‌లో ఆగిపోతున్నాయి. అలా వెయి కోట్లు చాలా కాలంగా మిస్ అవుతుంది. అలాగ‌ని స‌త్తా లేని ద‌ర్శ కులు అక్క‌డ లేక‌పోలేదు. మ‌ణిర‌త్నం, నెల్సన్ దిలీప్ కుమార్, శంక‌ర్, లోకేష్ క‌న‌గ‌రాజ్, హెచ్. వినోధ్, పా రంజిత్ , అట్లీ లాంటి వారున్నారు. కానీ సాధ్య‌పడ‌టం లేదు. అట్లీ `జ‌వాన్` తో సాధించినా అది హిందీలో.

అందులో హీరో షారుక్ ఖాన్. కాబ‌ట్టి అది చెల్ల‌దు. మ‌ణిర‌త్నం సినిమాలు 500 కోట్ల వ‌సూళ్లు సాధించిన రికార్డు లున్నాయి. ప్ర‌స్తుతం `థ‌గ్ లైఫ్` తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా 1000 కోట్ల వ‌సూళ్ల సినిమా గురించి ఆయ‌న ముందు ప్ర‌స్తావిస్తే త‌న‌కు మాత్రం వెయ్యి కోట్లు తెచ్చే సినిమా స‌త్తా లేద‌ని తేల్చేసారు. తాను కేవ‌లం ప్రేక్ష‌కుల ఎంత మంచి సినిమా ఇచ్చాను అనే విష‌యాన్ని త‌ప్ప మ‌రేది ఆలోచించ‌న్నారు.

`ఒక‌ప్పుడు హిట్..ప్లాప్ గురించే మాట్లాడుకునే వాళ్లం. ప్రేక్ష‌కులు..ఫిమ్మ్ మేక‌ర్స్ ఇదే చేసేవారు. సినిమా బాగుంటే బోనస్ లా క‌లిసొచ్చేది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌కుల మ‌ద్య పోటీ ఉండేది. ఓడైరెక్ట‌ర్ మంచి సినిమా తీస్తే అత‌డిని మించిన గొప్ప సినిమా తీయాల‌నే క‌సి ఉండేది. ఇప్పుడు అలాగే ఉండాలి. కానీ అలా లేదు. నేను మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇవ్వ‌డం గురించే ఆలోచిస్తాను. వ‌సూళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదు` అన్నారు.

కానీ ఇప్పుడు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. అసలు విషయాల కంటే దీని మీద ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటోంది. అది శ్రేయస్కరం కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా ఇవే ఉంటాయి. నేనైతే వెయ్యి కోట్ల సినిమా చేయలేను. అలా వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని సినిమా చేయను. నా దృష్టి వసూళ్ల కంటే కంటెంట్ మీదే ఉంటుంది. లెక్కలేసుకుని సినిమా చేయలేను” అని మణిరత్నం స్పష్టం చేశారు.

Tags:    

Similar News