తండ్రి అడుగుజాడల్లో చినబాబు... లక్‌ కలిసి వచ్చేనా?

ఆ మధ్య తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో పవర్‌ ఫుల్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు.

Update: 2026-09-08 14:30 GMT

మంచు మోహన్‌బాబు కెరీర్‌ ఆరంభం నుంచి విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ వచ్చాడు. మొదట్లో విలన్‌ పాత్రల్లో నటించి, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా మోహన్‌ బాబు సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు మళ్లీ యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో మోహన్‌బాబు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్ పాత్రల్లో నటించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కొన్ని సినిమాలను చేసిన విషయం తెల్సిందే. మోహన్‌ బాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా సినిమాలు చేస్తూ, ఏదో ఒక తరహాలో సినిమాల్లో కనిపిస్తూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో మంచు మనోజ్‌ సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమాలకు కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకున్న మంచు మనోజ్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం.

మిరాయ్ సినిమాలో మంచు మనోజ్‌...

ఆ మధ్య తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో పవర్‌ ఫుల్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు. మంచు మనోజ్‌ ను విలన్‌ పాత్రలో చూడటం కొత్తగా అనిపించడంతో పాటు, మిరాయ్‌ మూవీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మంచు మనోజ్‌ కి మరిన్ని నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు వస్తున్నాయి. మిరాయ్‌ తర్వాత మంచు మనోజ్‌ 'దాదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న దాదా సినిమాలో మంచు మనోజ్‌ కీలకమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. మంచు మనోజ్‌ హీరోగా మంచి సినిమాలు చేశాడు, కానీ ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని భావిస్తున్నాడు.

బాలకృష్ణ దాదా సినిమాలో...

మోహన్‌ బాబు తరహాలో నటుడిగా నిరూపించుకునేందుకు మనోజ్‌ సిద్ధంగా ఉన్నాడు. విలన్‌ పాత్రల్లో నటించడం ద్వారా హీరోగా కంటే ఎక్కువ ట్యాలెంట్‌ చూపించే అవకాశం ఉంటుందని అంటారు. కనుక దాదా సినిమాలో మరోసారి మంచు మనోజ్‌ తన సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. మంచు మనోజ్‌ గ్యాప్‌ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే వాటిల్లో ఎక్కువగా నెగటివ్‌షేడ్స్ పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. హీరోగా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశాడు. విలన్‌గా కొన్ని వరుస సినిమాలు చేసిన తర్వాత మళ్లీ మంచు మనోజ్‌ హీరోగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మోహన్‌ బాబు తరహాలో మంచు మనోజ్‌..

దర్శకుడు గోపీచంద్‌ మలినేని గత చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదా సినిమాలో మంచు మనోజ్‌ మాత్రమే కాకుండా సంజయ్ దత్‌ సైతం విలన్‌ గా కనిపించబోతున్నాడు. బాలకృష్ణ గెటప్‌తో పాటు, పలు విషయాలకు ఇప్పటికే పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. అందుకే దాదా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మిరాయ్‌ తర్వాత దాదాతో మంచు మనోజ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే కచ్చితంగా మరిన్ని పాత్రలు ఆయన వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ బాలకృష్ణ, మంచు మనోజ్‌ కలిసి ఒక సినిమాలో నటించారు. అయితే ఈసారి పూర్తి స్థాయి విలన్‌ పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్న కారణంగా అందరి దృష్టి ఉంది. మోహన్‌బాబు కి విలన్‌ వేశాలు బాగా కలిసి వచ్చాయని అంటారు. మరి అవే విలన్ వేశాలు మంచు మనోజ్‌కి కలిసి వచ్చేనా అనేది చూడాలి.

Tags:    

Similar News