కోలీవుడ్ బాలీవుడ్ క‌లిసింద‌లా? మ‌రి టాలీవుడ్!

నిజంగా ఈ క‌ల‌యిక‌లు క‌లిసిన వేళ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఓ మ‌హాద్భుతం జ‌రుగుతుంద‌న్న‌ది వాస్త‌వం. ఇదంతా స‌రే.;

Update: 2025-09-20 01:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్-విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ కి రెడీ అవుతున్నారు. ఆ క‌ల‌యికని క‌లిపే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. ఇద్ద‌రు స్టార్లు ఒకే తాటిపైకి రావ‌డం అన్న‌ది గొప్ప విష‌యం. బాలీవుడ్ లో ఖాన్ త్ర‌యం అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ కూడా క‌లిసి న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతా లిచ్చారు అమీర్. ఈ త్ర‌యాన్ని ఎవ‌రు తెర‌పై ఆవిష్క‌రిస్తారు? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రం. నిజంగా ఈ క‌ల‌యిక‌లు క‌లిసిన వేళ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఓ మ‌హాద్భుతం జ‌రుగుతుంద‌న్న‌ది వాస్త‌వం. ఇదంతా స‌రే.

ద‌ర్శ‌క శిఖ‌ర‌మే ఆ ఛాన్స్ తీసుకుంటే:

మ‌రి టాలీవుడ్లో అలాంటి క్రేజీ కాంబినేష‌న్ ఎవ‌రు? అంటే నిర్మొహ‌మాటంగా మ‌హేష్-ప్ర‌భాస్ అని చెప్పొచ్చు. రెండు అసాధార‌ణ‌మైన క‌టౌట్లు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్. గ్లోబ‌ల్ స్థాయిలోనూ ఇమేజ్ ఉన్న న‌టుడు. #ఎస్ ఎస్ ఎంబీ 29తో మ‌హేష్ ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. ఒక్క చిత్రంతోనే వ‌ర‌ల్డ్ ని దున్నేసే ప్లాన్ లో ఉన్నారు. అందుకు రాజమౌళి బ్యాకెండ్ లో చేయాల్సింద‌ల్లా చేస్తున్నారు. మ‌హేష్ ని ఎలా లాంచ్ చేయాలో ప‌క్కా ప్ర‌ళాణిక‌తోనే బ‌రిలోకి దిగుతున్నారు. అదే ద్వ‌యాన్ని భ‌విష్య‌త్ లో రాజ‌మౌళి ఒకే తాటిపైకి తీసుకొస్తే! అది విధ్వంస‌మే.

మ‌హేష్‌-ప్ర‌భాస్ ఒకే ప్రేమ్ లో:

ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది క‌దూ. మ‌రి ఇది సాధ్య‌మేనా అంటే? ఎందుకు సాధ్యం కాదు. `ఆర్ ఆర్ ఆర్` తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఓ గొప్ప చిత్రాన్నితీసి హాలీవుడ్ లో సైతం ప్ర‌శంస లందుకున్నారు. ఆ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని ఏ అభిమాని ఊహ‌కి రానేలేదు. అప్ప‌టిక‌ప్పుడ‌ల్లా క‌థ కుద‌ర‌డంతో? రాజ‌మౌళి రంగంలోకి దిగిపోయారు. హృతిక్ రోష‌న్ తో ఎన్టీఆర్ `వార్ 2` కి ప‌ని చేయ‌డం కూడా అలాగే జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ లోనూ ప్ర‌భాస్-మ‌హేష్ ల‌ను ఒకే తెరపై చూసే అవ‌కాశాలు ఎంతో మెండుగా ఉన్నాయి.

ప్ర‌యోగాల‌కు వెనుకాడ‌ని ప‌రిశ్ర‌మ‌గా:

రాజమౌళి కాక‌పోతో మ‌రో ద‌ర్శ‌కుడైనా ఆ ఛాన్స్ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రో ఐదేళ్ల‌లో టాలీవుడ్ ఇంకా అప్డేట్ అవుతుంది. తెలుగు సినిమా హాలీవుడ్ లో సైతం స‌త్తా చాటే రోజులు ద‌గ్గ‌ర‌ల్లోనే ఉన్నాయి. సుకుమార్ , సందీప్ రెడ్డి వంగా, ప్ర‌శాంత్ నీల్ స‌హా ఎంతో మంది ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లున్న ప‌రిశ్ర‌మ ఇది. ప్ర‌యోగాల‌కు వెనుకా డని ప‌రిశ్ర‌మ‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఆస్కార్ అందుకున్న మొట్ట మొద‌టి ప‌రిశ్ర‌మ టాలీవుడ్డే. ఇంత‌టి బ్యాక‌ప్ ఉన్న‌ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మలో మ‌రెన్నో అద్భుతాల‌కు అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News