వీడియో : లారెన్స్ బుల్లెట్ బండి ఫస్ట్ రైడ్ చూడండి
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ్ మూవీ 'బుల్లెట్'.;
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ్ మూవీ 'బుల్లెట్'. ఈ సినిమాను తెలుగులో 'బుల్లెట్ బండి' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రాఘవ లారెన్స్‌కి తెలుగు లో ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో తమిళ్ సినిమా అన్నట్లుగా కాకుండా తెలుగు సినిమా అన్న రేంజ్‌లోనే రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాఘవ లారెన్స్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. అందుకే ఈ సినిమాతో అయినా ఆయన అభిమానులను అలరిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెరిగే విధంగా టీజర్ ఉంది. తాజాగా ఈ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు.
బుల్లెట్ బండి టీజర్‌కి పాజిటివ్ రెస్పాన్స్
డైరీ వంటి విభిన్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఇన్నాసి పాండియన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి పెరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో మంచి స్పందన దక్కించుకుంది. బుల్లెట్ టైటిల్‌ను బుల్లెట్ బండి అని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చడం ద్వారా సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చారంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా లారెన్స్ కనిపించబోతున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన చర్చ ప్రముఖంగా జరుగుతోంది.
లారెన్స్ సోదరుడు ఎల్విన్ ఎంట్రీ
ఈ సినిమాతో లారెన్స్ సోదరుడు ఎల్విన్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎల్విన్ నటించడం మొదటి సారి కాగా, ఫస్ట్ టైం అన్న లారెన్స్ తో నటించడం ద్వారా ఈ బుల్లెట్ బండి సినిమాకు బజ్ పెరిగింది. ఈ సినిమాను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్ కతిరేసన్ నిర్మించారు. టీజర్‌లో.. జీవితంలోని కొన్ని చిక్కు ముడులకు ఎన్నటికీ సమాధానం దొకరదు అంటూ చెప్పిన డైలాగ్‌తో ఇదో ఇంట్రస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. లారెన్స్ వరుసగా తన దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే మరో వైపు ఇలా ఇతర దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేయడం విశేషం. ఇన్నాళ్లుగా ఎల్విన్ ఎంట్రీ గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఇప్పటికి లారెన్స్ తమ్ముడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఫ్యూచర్ గురించిన చర్చ మొదలైంది.
కాంచన 4 కోసం ఎదురు చూపులు
రాఘవ లారెన్స్ కాంచన ప్రాంచైజీలో కొత్త సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా లైన్‌లో ఉండగానే ఈ సినిమాను మొదలు పెట్టడంతో పాటు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బుల్లెట్ బండి సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ దసరాకు వీలు పడకుంటే దీపావళికి ఖచ్చితంగా విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది.
ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ కాంచన ప్రాంచైజీలో కొత్తగా రాబోతున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాంచన 4 గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇవే కాకుండా దుర్గ, బెంజ్ సినిమాలతో పాటు ఒక హిందీ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న సినిమాలోనూ లారెన్స్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రాఘవ ఈ దీపావళికి రాబోతున్న బుల్లెట్ బండి ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.