ఫోటో స్టోరి: మిల్కీ బ్యూటీ సిస్టర్‌లా ఉంది
దక్షిణాదిన వరుసగా సినిమాలు చేస్తూ పాపులర్ నటిగా వెలిగిపోతోంది కయాదు లోహార్.;
దక్షిణాదిన వరుసగా సినిమాలు చేస్తూ పాపులర్ నటిగా వెలిగిపోతోంది కయాదు లోహార్. ఈ మోడల్ కం నటి 100 కోట్ల క్లబ్ లో చేరిన `డ్రాగన్` అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీలో నటించింది ఇప్పటికే. అన్ని దక్షిణ భారత భాషలకు పరిచయమైంది. 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో అరంగేట్రం చేసిన ఈ భామ మాలీవుడ్ లో పథోన్‌పథం నూట్టండు (2022), ఒరు జాతి జాతకం (2025) చిత్రాల్లో నటించింది. తమిళ చిత్రం డ్రాగన్‌లో రెండవ కథానాయికగా తనదైన నటనతో ఆకట్టుకుంది.
కయాదు లోహర్ స్వస్థలం అస్సాంలోని తేజ్‌పూర్. బీకామ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత నటిగాను అవకాశాలు అందుకుంటోంది. కన్నడలో మొదటి సినిమా చేసిన కాయాదు 2022లో పాథోన్‌పథం నూత్తండుతో మలయాళంలో అరంగేట్రం చేసింది. చారిత్రక కథతో రూపొందించిన ఈ చిత్రంలో తన నటనకు మంచి పేరొచ్చింది.
అల్లూరి (2022) చిత్రంతో తెలుగులోకి ప్రవేశించింది. తనదైన అందం, నట ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐ ప్రేమ్ యు (2023)తో మరాఠీలో అరంగేట్రం చేసింది. ఒరు జాతి జాతకం అనే మలయాళ చిత్రంలోను కాయాదు నటించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం డ్రాగన్ (2025) కయాదు కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రంలో ఆమె ప్రదీప్ రంగనాథన్‌కు కాబోయే భార్యగా నటించింది. తన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ `వెందు తనింధాతు కాదు` చిత్రానికి కయాదు సంతకం చేసింది. తదుపరి `ఇదయం మురళి` అనే చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతోంది.
కయాదు సోషల్ మీడియాల్లోను చాలా యాక్టివ్ గా ఉంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో కయాదు చూడటానికి అచ్చం మిల్కీ వైట్ బ్యూటీని తలపిస్తోంది. బ్లూ శారీలో కొత్త లుక్ చూడగానే మిల్కీ వైట్ బ్యూటీకి సిస్టర్ లా కనిపించింది! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.