ఆ వంట దేనికో.. కిరణ్ అబ్బవరం క్రేజీ హింట్స్

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ కు దారి తీస్తోంది.

Update: 2026-06-12 17:42 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల లైనప్ తో ఆడియన్స్ కు కొత్త ఫీల్ ఇస్తున్నాడు. క సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో, ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ఇక లేటెస్ట్ గా తన 13వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ కు దారి తీస్తోంది.



 


ఈ పోస్టర్ చూస్తే ఒక పక్కా విలేజ్ లేదా మాస్ క్యాటరింగ్ సెటప్ లాంటి వాతావరణం కనిపిస్తోంది. పైనుంచి వెలుతురు పడుతున్న ఒక పెద్ద వంటగదిలో, మండుతున్న పొయ్యి మీద ఉన్న భారీ పాత్ర ముందు కిరణ్ లుంగీ కట్టి వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఒక చేతిలో ఎర్ర రుమాలు ఊపుతూ, ఇంకో చేత్తో ఫుడ్ సూపర్ గా కుదిరింది అనేలా చేస్తున్న సైగ పక్కా లోకల్ వైబ్స్ ఇస్తున్నాయి.

పక్కనే స్టూల్ మీద ఒక పెద్ద గరిటె, అరటి ఆకులు, గిన్నెలు చూస్తుంటే ఈ సినిమాలో హీరో ఒక మాస్ వంట మాస్టర్ గా కనిపించబోతున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఈ పోస్టర్ లో ఒక డార్క్ యాక్షన్ హింట్ కూడా దాగుందని తెలుస్తోంది. హీరో నిలబడిన నేల మీద ఎర్రటి రంగులో కనిపిస్తున్న మరకలు చూస్తుంటే, ఇది కేవలం వంటల చుట్టూ తిరిగే కథ కాదని, దీని వెనుక ఏదో బలమైన రివెంజ్ లేదా మాస్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతోంది.

మన కమర్షియల్ సినిమాల్లో హీరో వంట చేస్తున్నాడంటే, ఆ తర్వాత విలన్లకు గట్టిగానే వడ్డన ఉంటుందని ఆడియన్స్ ఈజీగా గెస్ చేస్తారు. ఆ ఎర్ర రుమాలు కూడా అదే రేంజ్ లో యాక్షన్ సింబాలిజం ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం ఒక ప్రత్యేకత. హీరోగా నటిస్తూనే ఈ డిఫరెంట్ కథను తన విజన్ కు తగ్గట్లుగా తెరకెక్కిస్తున్నాడు.

జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పల్లెటూరి మాస్ యాక్షన్ కు ప్రాణం పోసే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. భీమ్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోడవ్వడం ఈ తరహా కథలకు చాలా ప్లస్ అవుతుంది. గతంలో రొటీన్ లవ్ స్టోరీల నుంచి బయటపడి ఇప్పుడు పూర్తిగా కొత్త దారిలో వెళ్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి రూరల్ బేస్డ్ కథలు, మాస్ క్యారెక్టరైజేషన్లు ఈ జనరేషన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ లోని సెటప్ తోనే ఒక పాజిటివ్ బజ్, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన కిరణ్, ముందు ముందు ఎలాంటి మాస్ ఫీస్ట్ రెడీ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News