తల్లైన తర్వాత తొలిసారి క్రేజీ లుక్.. ఫ్యాన్స్ ఫిదా!

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వివాహం అయిన తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంటే.. మరికొంతమంది తల్లిదండ్రులైన తర్వాత బ్రేక్ తీసుకుంటారు.;

Update: 2025-12-10 10:16 GMT

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వివాహం అయిన తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంటే.. మరికొంతమంది తల్లిదండ్రులైన తర్వాత బ్రేక్ తీసుకుంటారు. ఇంకొంతమంది పెళ్లయి, పిల్లలు పుడితే శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ మాత్రం ఒకవైపు ప్రెగ్నెంట్ గా ఉన్నా..మరొకవైపు సినిమాలలో చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొనే లాంటి సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీలో కూడా నటించి నటనపై తమకున్న మక్కువను నిరూపించారు. ఇంకొంతమంది తల్లిదండ్రులైన కొన్ని రోజులకే సినిమా షూటింగ్లో పాల్గొని అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు




ఇంకొంతమంది అభిమానులను ఆకట్టుకోవడానికి తల్లిగా మారిన తర్వాత తమ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కియారా అద్వానీ కూడా ఒకరు. ఈ ఏడాది రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన వార్ 2 చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. కానీ రెండు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా తాలూకు ఫలితాలు ఆమెను మరింతగా నిరాశపరచలేదనే వార్తలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.




ఇకపోతే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ.. కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత తల్లి అయిన తొలిసారి ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని కూల్ ఫోటోలను పంచుకుంది. అందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. ఈ బాడీ కాన్ అవుట్ ఫిట్ తో అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా మిర్రర్ ముందు స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా.."చివరికి నాకు ఒక రాత్రి ఫ్రీగా దొరికింది.ఈ రాత్రిని నన్ను ఆస్వాదించనివ్వండి" అంటూ క్యాప్షన్ జోడించింది.. ప్రస్తుతం ఆరంజ్ కలర్ అవుట్ ఫిట్ లో కియారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా తల్లి అయిన తర్వాత కూడా కియారాలో ఎటువంటి మార్పులు రాలేదు సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.




కియారా అద్వానీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కన్నడలో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక విడుదలకు కేవలం మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో షూటింగ్లో తిరిగి పాల్గొనబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కియారా అద్వానీకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News