ఆ ఇద్దరు సెట్..మరి అలనాటి అందాల తార సంగతేంటి?
బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన `ఖల్ నాయక్` ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. నేటికి ఆ సినిమా గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.
బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన `ఖల్ నాయక్` ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. నేటికి ఆ సినిమా గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ చిత్రంవిడుదలై మూడు దశాబ్దాలైన సందర్భంగా ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా `ఖల్ నాయక్ రిటర్న్స్` ప్రకటించారు.ఈ విషయాన్ని సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ అధికారికంగా ధృవీకరించారు. నాటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో సంజయ్ దత్ పోషించిన బల్లు బలరామ్- జాకీ ష్రాఫ్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ రామ్ మధ్య సాగిన పిల్లి-ఎలుక ఆట ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సుల్లో సజీవంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మరోసారి
సీక్వెల్ కి రెడీ అవుతున్నారు.
ఒరిజినల్ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ రామ్‌గా కనిపించిన జాకీ ఈ కొత్త భాగంలో ప్రమోషన్ పొంది ఉంటారని సూచిస్తూ కచ్చితంగా ఇందులో కమిషనర్ ఉండాలి కదా? `కమిషనర్ తో హోగా నా’`(కమిషనర్ ఉంటాడు కదా)` అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంతేకాదు తన చిరకాల మిత్రుడు సంజయ్ దత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేసారు. `సంజూ బాబా నా ప్రాణం అంటూ వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే తాను దర్శకుడు సుభాష్ ఘాయ్ -సంజయ్ దత్‌లతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
అయితే `ఖల్ నాయక్ రిటర్న్స్` కథ వెనుక ఉన్న పుట్టుక చాలా ఆసక్తికరమైనదని ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ ఎరవాడ సెంట్రర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఈ సీక్వెల్ ఆలోచన ఆయన మనసులోకి మొదిలింది. జైలులోని తోటి ఖైదీలతో మాట్లాడు తున్నప్పుడు ఇప్పటికీ బల్లు క్యారెక్టర్ పట్ల ప్రజల్లో క్రేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సంజయ్ ప్రయత్నించారు. దాదాపు 4000 మంది ఖైదీలను అడిగితే వారంతా బల్లు కథను ముందుకు తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
అంతేకాదు వారి ఊహల్లో బల్లు భవిష్యత్తు ఎలా ఉండాల? ఒక్కో పేజీ కథాంశాన్ని రాయాల్సిందిగా సంజయ్ కోరగా.. వేల సంఖ్యలో చేతిరాత ప్రతులు వచ్చాయి. పిరోల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలను సుభాష్ ఘాయ్‌కి వివరించడంతో సీక్వెల్ లాంఛనమైంది. నిర్మాణ పరంగానూ సీక్వెల్ మునుపటి కంటే భారీ స్థాయిలో.. ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్-`ఆస్పెక్ట్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలు ముక్తా ఆర్ట్స్ నుండి చిత్ర హక్కులను అధికారికంగా దక్కించుకున్నాయి. దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ ప్రాజెక్ట్‌కు సృజనాత్మక సలహాదారుడిగా వ్యవహరిస్తుండగా.. జియో స్టూడియోస్ ఎగ్జ్యూటివ్ జ్యోతి దేశ్‌పాండే ప్రొడక్షన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల ముంబై ఈవెంట్‌లో ప్రదర్శించిన టీజర్ గ్లింప్స్‌లో సంజయ్ దత్ వయసు పైబడి.. రగ్గడ్ లుక్‌లో కనిపించి సినిమా డార్క్ టోన్‌ను పరిచయం చేశారు. ఈ చిత్రంలోని అద్భుతమైన సంగీతం .. మాధురీ దీక్షిత్ పోషించిన గంగ పాత్ర కూడా ఎంతో కీలమైంది. ఆ సినిమాలో అండర్ కవర్ కాప్‌గా మాధురీ నటన `చోళీ కే పీచే క్యా హై` సాంగ్ భారతీయ సినిమా చరిత్రలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు రామ్ - బల్లు పాత్రలు తిరిగి రావడం ఖాయమైనా? గంగ పాత్రలో మాధురీ దీక్షిత్ మళ్లీ నటిస్తారా లేదా అనే విషయంపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో పాత తరం అభిమానులు ఆ ముగ్గురి కాంబినేషన్‌ను మళ్లీ చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. తొంభైల నాటి కల్ట్ క్లాసిక్ యాక్షన్ డ్రామాను నేటి తరం ప్రేక్షకులకు తగినట్లుగా పునసృష్టించడం బాలీవుడ్‌కు పెద్ద సవాలుతో కూడిన వ్యవహారమే.