• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పట్లోనే ఉగ్రవాది అజర్...

అప్పట్లోనే ఉగ్రవాది అజర్ మసూద్ ను పట్టుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్

| అది 2002.. ఖమ్మంలోని వినోద సినిమా థియేటర్. అక్కడ ఓ సంచలన సినిమా ఆడుతోంది.. కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి వంటి ఘటనలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు దారుణంగా క్షీణించాయి.

By - Tupaki Desk
Update: 2025-05-14 08:45 GMT

అది 2002.. ఖమ్మంలోని వినోద సినిమా థియేటర్. అక్కడ ఓ సంచలన సినిమా ఆడుతోంది.. కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి వంటి ఘటనలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు దారుణంగా క్షీణించాయి. అలాంటి సమయంలో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా పెను సంచలనం రేపింది. బ్లాక్ బస్టర్ గానూ నిలిచింది. సొంత జిల్లా కావడంతో ఈ సినిమాలో కీలక నటించిన ఓ వ్యక్తి ఖమ్మం థియేటర్ కు వచ్చాడు. దీంతో భారీఎత్తున జనం పోగయ్యారు..

పైన చెప్పుకొన్న సినిమా పేరు ‘ఖడ్గం’.. అందులో భయంకర ఉగ్రవాది మసూద్ అజహర్ పాత్రలో నటించింది ఖమ్మం జిల్లాకు చెందిన నటుడు. కలర్, కళ్లు, కళ్లజోడు, వస్త్రధారణ సహా అన్ని విషయాల్లో మసూద్ అజహర్ ను అచ్చుగుద్దినట్లు దింపేశాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.

1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ అనంతరం మసూద్ అజహర్ ను విడిచిపెట్టింది భారత్. దీంతో అతడు జైషే అహ్మద్ పేరిట కొత్త ఉగ్రవాద సంస్థను స్థాపించి 26 ఏళ్లుగా పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. అనేక దారుణ దాడులకు పాల్పడిన అతడు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కాగా, 1999 తర్వాత వైరల్ అయిన మసూద్ అజహర్ ఫొటోల ఆధారంగానే ఖడ్గం సినిమాలో క్యారెక్టర్ ను పెట్టారు కృష్ణవంశీ.

తాజాగా పెహల్గామ్ దాడికి పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న అనంతరం మసూద్ అజహర్ గురించి ప్రస్తావన వచ్చింది. అతడి కుటుంబానికి చెందిన 14 మందిని ఒక్క దెబ్బతో భారత్ హతమార్చడంతో ’నేను పోయినా బాగుండేది’ అంటూ మసూద్ అజహర్ రోదించాడు.

ఇక అసలు పాయింట్ కు వస్తే 2002లోనే మసూద్ అజహర్ ను తన సినిమాలో చూపించిన కృష్ణవంశీని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. భారత దళాలకు దొరకని ఆ భయంకర ఉగ్రవాదిని.. కృష్ణవంశీ మాత్రం తన సినిమా కోసం ’పట్టుకున్నారు’ అని చెప్పుకొంటున్నారు. అందుకే ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అయ్యారని కొనియాడుతున్నారు.

కొసమెరుపు: దేశభక్తి మేళవించిన ఖడ్గం సినిమా సూపర్ హిట్ అవడమే కాక అవార్డులు కొల్లగొట్టింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ తో పాటు ఇందులో నటించిన రవితేజ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ ప్రథ్వీ, సంగీత తదితరులు తర్వాతి కాలంలో పెద్ద స్టార్లు అయ్యారు. అయితే, కీలకమైన మసూద్ అజహర్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి మాత్రం మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

Tags:    
  • Khadgam 
  • MasoodAzhar 
  • KrishnaVamsi 
  • PatrioticCinema 
  • TeluguMovies 
  • KhammamActor 
  • UnsungHeroes 
  • IndianCinema 
  • DeshBhaktiFilms 
  • TollywoodClassics 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS